ఏపీకి ఒక తీరుగా.. మనకో తీరుగా!

వివాదాస్పదమవుతున్న కృష్ణా బోర్డు స్పందన

ఏపీ వాట్సప్ మెసేజ్ కే బోర్డు యాక్షన్ ..

తెలంగాణ చేసే అడపాదడపా ఫిర్యాదులకూ స్లో రియాక్షన్

శ్రీశైలంలో తెలంగాణ పవర్జనరేషన్

కేంద్రానికి బోర్డు కంప్లయింట్

కామన్రిజర్వాయర్ నీటిని వదులుతున్నా ఏపీ అక్కసు

సాగర్కింద నీళ్లిచ్చే ప్రాంతాలనూ శ్రీశైలంపై ఆధారపడ్డట్టుగా చూపిన ఏపీ

ఏపీ కంప్లైంట్ను ఉన్నదున్నట్లు ఫాలో అయిన బోర్డు

రాయలసీమ లిఫ్ట్కోసం ఏపీ టెండర్లు పిలుస్తున్నా పట్టించుకోని వైనం

బోర్డు తీరుపై తెలంగాణ ఇంజనీర్ల ఆగ్రహం

హైదరాబాద్‌, వెలుగు: తెలంగాణపై ఏపీ చేసే కంప్లయింట్లకు ఆగమేఘాల మీద కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (కేఆర్ ఎంబీ) స్పందిస్తోంది. కానీ.. తెలంగాణ చేసే అడపాదడపా ఫిర్యాదులకు కూడా సరిగ్గా స్పందిం చడం లేదు. కేం ద్రం కల్పించుకుంటే కానీ ఊసెత్తడం లేదు. రెండు రాష్ట్రాలకు కామన్‌ ప్రాజెక్టు అయిన నాగార్జునసాగర్ కు పవర్‌ హౌస్‌ ద్వారా నీటిని తెలంగాణ విడుదల చేస్తుంటే.. నీటి విడుదలను ఆపేలా తెలంగాణను ఆదేశించాలని కృష్ణా బోర్డుకు ఇటీవల కంప్లయింట్ ఏపీ కోరిం ది. దీనిపై వెంటనే స్పందించిన బోర్డు.. కేం ద్రానికి ఫిర్యాదు చేసింది.

అదే.. ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్‌‌ స్కీంకు టెండర్లు పిలిచినా బోర్డు కేంద్రం దృష్టికి తీసుకుపోలేదు. కేంద్రం జోక్యం తోనే ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్లొద్దని ఏపీని కృష్ణా బోర్డు ఆదేశించింది తప్ప సొంతగా నిర్ణయం తీసుకోలేదు. కృష్ణా బోర్డు తీరును తెలంగాణ ఇంజనీర్లు తప్పుబడుతున్నారు. ఏపీ రీ ఆర్గనైజేషన్‌‌ యాక్ట్‌‌కు వ్యతిరే కంగా ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు చేపడుతుంటే ప్రేక్షకపాత్ర వహించిన కృష్ణా బోర్డు.. తెలంగాణ పవర్‌‌ జనరేషన్‌‌ను అడ్డుకునేందుకు ఇప్పటికే పలురకాలుగా ప్రయత్నించిందని వారు ఆరోపిస్తున్నారు. కృష్ణా బేసిన్‌‌లో ఈసారి ముందే వరదలు రావడంతో శ్రీశైలం లెఫ్ట్‌‌ పవర్‌‌ హౌస్‌‌ ద్వారా కరెంట్‌‌ ఉత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌‌లోకి తెలంగాణ నీటిని విడుదల చేస్తోంది. పవర్‌‌ జనరేషన్‌‌ మొదలు పెట్టిన రోజు శ్రీశైలం ప్రాజెక్టు ఎస్‌‌ఈ కేఆర్‌‌ఎంబీకి కంప్లైంట్‌‌ చేశారు.

దానిని పరిగణనలోకి తీసుకోవాలంటూ ఏపీ ఈఎన్సీ వాట్సప్‌‌  మెసేజ్‌ పెట్టారు . దీంతో కేఆర్‌‌ఎంబీ అప్పటికప్పుడు నీటి విడుదలను ఆపాలంటూ తెలంగాణకు లేఖ రాసింది. ఆ లేఖకు తెలంగాణ ఈఎన్సీ బదులిస్తూ సాగర్‌‌లోకి విడుదల చేసే నీటిని రెండు రాష్ట్రాల వినియోగం కోసం నిల్వ చేస్తున్నం తప్ప సొంతంగా వినియోగించుకోవడం లేదని స్పష్టం చేశారు. అయినా ఏపీ దీనిపై పలుమార్లు కంప్లైంట్లు చేస్తూ పోయింది. ఇప్పటికే బోర్డు నీటి విడుదలను ఆపాలంటూ రెండుసార్లు తెలంగాణను లేఖ ద్వారా ఆదేశించింది.

64.57 టీఎంసీలు తరలించారు

తెలంగాణ తమ ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవడం లేదంటూ కేఆర్‌‌ఎంబీ మెంబర్‌‌ (పవర్‌‌) ఎల్‌‌.బి. ముతంగ్‌‌ శుక్రవారం కేంద్ర జలశక్తి శాఖ సీనియర్‌‌ జాయింట్‌‌ కమిషనర్‌‌కు లేఖ రాశారు. శ్రీశైలంలో పవర్‌‌ జనరేషన్‌‌ ద్వారా నాగార్జునసాగర్‌‌కు నీటి విడుదలను ఆపేలా తెలంగాణను ఆదేశించాలని ఆ లేఖలో పేర్కొ న్నారు. జూన్‌‌ 4న నిర్వహించిన కేఆర్‌‌ఎంబీ మీటింగ్‌‌లో శ్రీశైలంలో ఉత్పత్తయ్యే కరెంట్‌‌ను రెండు రాష్ట్రాలు సమంగా పంచుకునేందుకు ఒప్పుకున్నాయని, ఆ ఒప్పందాన్ని అతిక్రమించి తెలంగాణ కరెంట్‌‌ ఉత్పత్తి చేస్తుందన్నారు. ఈ ఫ్లడ్‌‌ సీజన్‌‌లో గురువారం వరకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 114.16 టీఎంసీల వరద వస్తే తెలంగాణ లెఫ్ట్‌‌ పవర్‌‌ హౌస్‌‌ ద్వారా 64.57 టీఎంసీలను తరలించిందని వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తు తం 77.68 టీఎంసీల నీళ్లున్నాయని పేర్కొ న్నారు.

గుంటూరు, ప్రకాశానికి శ్రీశైలం నీళ్లిస్తరా?

శ్రీశైలంలో 854 లెవల్‌‌ మెయింటేన్‌‌ కాకపోవడం వల్ల ప్రకాశం, గుంటూరు జిల్లాలకు తాగునీటిని

ఇవ్వలేకపోతున్నామని ఏపీ తన లేఖల్లో ప్రస్తావించింది. కృష్ణా బోర్డు అదే విషయాన్ని కేంద్రానికి చేసిన కంప్లైంట్‌‌లోనూ పేర్కొంది. ఏపీ కంప్లైంట్‌‌ను మక్కీకి మక్కీకి దించడంతో పాటు గతంలో ఏపీ చేసిన ఫిర్యాదులు, దానికి ప్రతిగా తెలంగాణకు బోర్డు ఇచ్చిన ఆదేశాల లేఖలను ఈ ఫిర్యాదుకు బోర్డు జత చేసింది. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు తాగునీటిని నాగార్జునసాగర్‌‌ నుంచే ఇస్తు న్నారు. సాగర్‌‌ పవర్‌‌ హౌస్‌‌ ద్వారా విడుదల చేసే నీళ్లు పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి వెళ్తుండగా.. సాగర్ కుడి కెనాల్‌‌ గుంటూరు మీదుగా కృష్ణా జిల్లాకు నీటిని తీసుకుపోతుంది. దాన్ని మరిచి సాగర్‌‌ నుంచి నీళ్లు ఇవ్వాల్సిన జిల్లాలకు శ్రీశైలం నుంచే నీటిని ఇస్తు న్నామన్నట్టుగా బోర్డు పేర్కొంది.

నష్టం చేస్తున్నా రని చూపే ప్రయత్నమా?

రాయలసీమలోని నాలుగు జిల్లాలతోపాటు నెల్లూరు , ప్రకాశం, గుంటూరు జిల్లాలకు కనీసం తాగునీటిని కూడా ఇవ్వకుండా తెలంగాణ వ్యవహరిస్తోందనే ప్రచారం చేయాలనే తాపత్రయమే ఏపీ లేఖలో కనిపించింది. బోర్డు కూడా అదే విషయాన్ని తన లేఖలో ప్రస్తా వించింది. అదే క్రమంలో బేసిన్‌‌ అవతలి ప్రాంతాలకు కృష్ణా నీటి విడుదలను లీగలైజ్‌ చేసుకోవాలనే కుట్ర కూడా ఈ లెటర్‌‌ వెనుక దాగి ఉన్నట్టు గా తెలంగాణ ఇంజనీర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం, కృష్ణా బోర్డు కలిసి చేస్తు న్న ఇలాంటి కుట్రలను తిప్పికొట్టి కృష్ణా నీళ్లలో తెలంగాణ వాటాను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించాలని వారు సూచిస్తు న్నారు.

తెలంగాణ కంప్లైంట్లపై స్లో

తెలంగాణకు నష్టం చేకూ ర్చేలా ఏపీ తలపెట్టిన ప్రాజెక్టు లపై మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో ఒక ఫిర్యాదు చేస్తే దానిపై చర్యలు తీసుకోవడానికి కృష్ణా బోర్డు కూడా అంతకంటే నెమ్మదిగా రెస్పాండ్‌ అవుతోంది. కొన్ని ఫిర్యాదులపై కనీసం లెటర్లు రాయడానికీ సాహసించడం లేదు. రాయలసీమ లిఫ్ట్‌‌ విషయంలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌‌ షెకావత్‌ కు ఫిర్యాదు చేయగా.. సెంట్రల్‌‌ మినిస్టర్‌‌ ఆదేశాలతో బోర్డు ఏపీకి లేఖ రాసింది. రెండోసారి తెలంగాణ కంప్లైంట్‌‌ చేసిన నాలుగు రోజుల తర్వాత ఏపీకి బోర్డు లేఖ రాసింది. అదే ఏపీ వాట్సప్‌ మెసేజ్‌‌కే హైరానా పడిపోయి ఆగమేఘాల మీద తెలంగాణకు ఆదేశాలు ఇచ్చింది.

బేసిన్‌‌ అవతలికి నీళ్లా?

ఏ నదిలో లభ్యమయ్యే నీళ్లనైనా మొదట ఆ బేసిన్‌‌ అవసరాలకు మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఏపీ తనకు కేటాయిం చిన 512 టీఎంసీలను రాష్ట్రంలో ఎక్కడైనా వాడుకుంటామని చెప్తోంది. పోతిరెడ్డిపాడు నుంచి 90 శాతానికిపైగా నీటిని పెన్నా బేసిన్‌‌కే తరలిస్తోం ది. పెన్నా బేసిన్‌‌లోని రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరుకు తాగునీటిని ఇవ్వాలంటే శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం ఉండాలని ఏపీ డిమాండ్‌ చేస్తోంది. బేసిన్‌‌ అవతలికి నీటిని ఇవ్వడం తమ బాధ్యత అయినట్టు బోర్డు తన లేఖలో పెన్నా బేసిన్‌‌ నీటి అవసరాలను ప్రస్తావించింది.

Latest Updates