రైతుల ఆదాయాన్ని పెంచుతానని.. మిత్రుల సంపాదన పెంచారు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై రగడ నడుస్తోంది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు దేశ రాజధాని ఢిల్లీ బాట పట్టారు. అన్నదాతలు నిర్వహించిన ఛలో ఢిల్లీ కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో రైతుల నిరసనలపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వాన్ని సూట్ బూట్ సర్కార్ అంటూ రాహుల్ విమర్శించారు. ‘రైతుల ఆదాయం రెట్టింపవుతుందని ప్రభుత్వం చెప్పింది. కానీ ప్రభుత్వం చేసిందేంటి? ప్రభుత్వం తన మిత్రుల ఆదాయాన్ని నాలుగింతలు పెంచి అన్నదాతల ఆదాయాన్ని సగానికి తగ్గించింది. ఇది అబద్ధాల ప్రభుత్వం. ఇది సూట్-బూట్ గవర్నమెంట్’ అని రాహుల్ ట్వీట్ చేశారు.

Latest Updates