సైన్స్ ప్రకారం.. ప్రపంచంలోకెల్లా అందగత్తె ఈమేనట!

అద్దం ముందు నిల్చుంటే.. ఆహా ఎంత అందంగా పుట్టాం.. అనుకోనివాళ్లుండరేమో! అందానికి ఒక కొలమానం పెట్టి.. ప్రపంచంలోకెల్లా అందగత్తె ఎవరంటే ఏ మిస్ యూనివర్స్ పేరునో.. మిస్ వరల్డ్ పేరునో చెబుతాం. అది కూడా కళ్లతో చూసి, వాళ్ల వ్యక్తిత్వాన్ని బట్టి మార్కులేసి అందగత్తెలుగా నిర్ణయిస్తారు. కానీ అందం అంటే ముందు ఫేస్ చూసే కదా చెబుతాం. దీనికే సైన్స్ ప్రకారం ఓ లెక్క ఉంది.

ఆ సైన్స్ ప్రకారం పక్కా శాస్త్రీయంగా చెప్పాలంటే మాత్రం వీళ్లెవరూ నంబర్ వన్ అందగత్తెగా నిలవలేదు. అమెరికన్ మోడల్ బెల్లా హదీద్.. ప్రపంచంలోకెల్లా అత్యంత అందగత్తె అని తెల్చారు సైంటిస్టులు.

అందానికి సైన్స్ ప్రకారం కొలమానం ఇదీ

అందాన్ని కూడా సైన్స్ ప్రకారం కొలతలేస్తారా? అని అనుమానం రావొచ్చు. అవును, ఆ కొలమానం గ్రీక్ మ్యాథమాటిక్స్ ప్రకారం నిర్ణయించారు. ‘గోల్డెన్ రేష్యో ఆఫ్ బ్యూటి ఫై స్టాండర్డ్స్’ ఆధారంగా ముఖ సౌందర్యాన్ని కొలుస్తారు.

23 ఏళ్ల బెల్లా.. 94.35 శాతం మార్కులు

‘గోల్డెన్ రేష్యో ఆఫ్ బ్యూటి ఫై స్టాండర్డ్స్’ ప్రకారం 23 ఏళ్ల అమెరికా మోడల్ ప్రపంచంలోనే టాప్ అందగత్తెగా నిలిచింది. ఈ సైన్స్ లెక్కల ప్రకారం ఆమెకు 94.35 శాతం మార్కులు వచ్చాయి. ఆమె ఫేస్ లోనూ పర్ఫెక్ట్ గా ఉన్న పార్ట్ గడ్డమేనట. దీనికి 99.7 శాతం మార్కులు వేశారు సైంటిస్టులు.

అదరాల అందం 94 శాతం

ముఖంలో అన్ని భాగాల అందాన్ని‘గోల్డెన్ రేష్యో ఆఫ్ బ్యూటి ఫై స్టాండర్డ్స్’ ప్రకారం కొలత వేశారు బ్యూటీ శాస్త్రవేత్తలు. గడ్డం భాగానికి అత్యధికంగా 99.7 శాతం, నుదుటికి 97 శాతం, ముఖం ఆకృతికి 94.5 శాతం, కళ్లకు 97.65 శాతం, కనుబొమ్మలకు 89 శాతం, పెదాలకు 94.1 శాతం, ముక్కుకు 93.4 శాతం మార్కులేశారు.

Latest Updates