భారత్ నుంచి రైస్‌‌ను కొనుగోలు చేయనున్న చైనా

ముంబై: తూర్పు లడఖ్‌‌లో ఉద్రికత్తల నేపథ్యంలో భారత్-చైనా సంబంధాల్లో ప్రతిష్ఠంభన నెలకొంది. ఈ సమయంలో భారత్ నుంచి రైస్‌‌ను కొనుగోలు చేయాలని చైనా నిర్ణయించిందని సమాచారం. రైస్ సరఫరా కష్టతరమవడంతోపాటు డిస్కౌంట్ ధరలకు అమ్మడానికి ససేమిరా అనడంతో చాన్నాళ్లుగా భారత్ నుంచి రైస్‌‌ను చైనా కొనుగోలు చేయడం లేదు. గత మూడు దశాబ్దాల్లో భారత్ నుంచి రైస్‌‌ను చైనా దిగుమతి చేసుకోవడం ఇదే తొలిసారి కానుంది. ప్రపంచంలో అత్యధికంగా రైస్‌‌ను ఎగుమతి చేసే దేశంగా భారత్‌కు పేరుంది. అదే సమయంలో వరల్డ్‌‌లో రైస్‌‌ను ఎక్కువగా దిగుమతి చేసుకునే కంట్రీగా చైనాను చెప్పొచ్చు.

‘తొలిసారి చైనా మన దగ్గర నుంచి రైస్‌‌ను కొనుగోలు చేస్తోంది. భారత వరి క్వాలిటీని చూశాక వచ్చే ఏడాది చైనా మరింతగా రైస్‌‌ను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి’ అని రైస్ ఎక్స్‌‌పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బీవీ కృష్ణా రావు పేర్కొన్నారు. డిసెంబర్-ఫిబ్రవరి మధ్య కాలంలో లక్ష టన్నుల రైస్‌‌ను ఎగుమతికి భారత ట్రేడర్లతో చైనా ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతి టన్నుకు దాదాపుగా రూ.21,900 చెల్లించనున్నట్లు సమాచారం. చైనా మామూలుగా థాయ్‌‌లాండ్, వియత్నాం, మయన్మార్, పాకిస్తాన్‌‌ల నుంచి రైస్‌‌ను కొనుగోలు చేస్తుంది.

Latest Updates