నాలుగోసారి కూతురు పుట్టిందని.. ముగ్గురు బిడ్డల్ని చంపి తండ్రి ఆత్మహత్య

ఓ వైపు.. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు ఎంతగా అవగాహ కల్పించే ప్రయత్నం చేస్తున్నా మార్పు రావడం లేదు. కొడుకే పుట్టాలన్న తాపత్రయం చావడం లేదు. మగబిడ్డ కోసం ప్రాణాలైనా తీసుకునే స్థితికి వెళ్లిపోతున్నారు కొందరు. గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో ఇలాంటి విషాద ఘటనే జరిగింది.

జునాగఢ్‌లోని ఖంభాలియా గ్రామానికి చెందిన ఓ రైతు కూలీ.. కుటుంబంలో ఒక్క మగబిడ్డ అయినా ఉండాలన్న ఆశ అతడిది. అయితే ఇప్పటికే అతడి భార్యకు మూడు కాన్పుల్లోనూ ఆడ పిల్లలే పుట్టారు. నిన్న ఆమెకు నాలుగో ప్రసవం జరిగింది. ఈ సారి కూడా పాపే పుట్టడంతో ఆ తండ్రి అమానవీయ చర్యకు దిగాడు. తొలి ముగ్గురు కూతుర్ల (9, 7, 2 ఏళ్ల వయసు)ను పొలంలోని బావిలో తోసేసి చంపాడు. ఆ తర్వాత అతడు కూడా ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆవేశంలో చేసిన ఈ పనితో భార్య, ఆ పసికందును దిక్కులేని వాళ్లను చేశాడతను. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates