గాడ్సే టెర్రరిస్టే : కమల్ కు అసదుద్దీన్ సపోర్ట్

నాథూరాం గాడ్సేను హిందూ ఉగ్రవాదిగా చెబుతూ కమల్ హాసన్ చేసిన కామెంట్స్ కు మద్దతు పలికారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. మహాత్మాగాంధీ లాంటి వ్యక్తిని చంపిన వ్యక్తిని మహాత్ముడని అనాలా.. లేక రాక్షసుడని అనాలా అని ఆయన ప్రశ్నించారు. టెర్రరిస్ట్ అనాలా లేక హంతకుడు అనాలా అని అన్నారు. కపూర్ కమిషన్ రిపోర్ట్ లో కుట్రదారుడిగా తేలిన వ్యక్తిని గొప్ప వ్యక్తిగా కొలుస్తామా.. లేక నీచుడిగా చూడాలా.. అని అడిగారు. మహాత్ముడిని చంపిన వాడు టెర్రరిస్టే అని అన్నారు అసదుద్దీన్ ఒవైసీ.

Latest Updates