మూక దాడులకు వ్యతిరేకంగా చట్టం తేవాలి : అసదుద్దీన్

దేశంలో మూక దాడులకు వ్యతిరేకంగా వెంటనే చట్టం తీసుకురావాలన్నారు MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే దాడులు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. దాడులు చేస్తున్నవారికి బీజేపీ నేతలు అండగా ఉంటున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

జార్ఖండ్ లో తబ్రేజ్ అన్సారీ మూకదాడి కేసులో 11 మంది నిందితులపై అభియోగాలను పోలీసులు రద్దు చేశారని ఆరోపించారు అసదుద్దీన్ ఒవైసీ. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ప్రధానంగా ఇలా జరుగుతోందన్నారు. రాజస్థాన్ లో పెహ్లూఖాన్ మూకదాడికేసులోనూ ఇలాగే జరిగిందనీ.. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపైనా ఆయన విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లో జాతీయ మీడియాతో మాట్లాడిన అసదుద్దీన్ ఒవైసీ.. నిందితులకు బీజేపీ పాలిత రాష్ట్రాల నాయకులు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.

Latest Updates