అందరూ నిర్ధోషులైతే కూల్చిందెవరు : అసదుద్దీన్ ఓవైసీ

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కోర్టు తీర్పు బాధ కలిగించింది. సరైన న్యాయం జరగలేదన్నారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ. అంతా నిర్దోషులైతే మసీదును ఎవరు కూల్చారు?  బాబ్రీ మసీదు దానంతట అదే కూలిపోయిందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

మసీదును ఎవరు కూల్చారో ప్రపంచం మొత్తం చూసిందన్నారు. ఉమా భారతి చేసిన వ్యాఖ్యలు నిజం కాదా అని వ్యాఖ్యానించారు.

గతంలో ఇదే అంశంపై  సుప్రీం కోర్టు గతంలోనే చట్ట నియమాలను అతిగా ఉల్లంఘించడం.. బహిరంగ స్థలంలోని ప్రార్థనా స్థలాన్ని నాశనం చేసిన చర్య గా వర్ణించింది. కానీ సీబీఐ కోర్టు మాత్రం అందరిని నిర్దోషులుగా ప్రకటించిందని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

 

Latest Updates