మసూద్ గ్లోబల్ టెర్రరిస్ట్: ఇది విక్టరీ కాదన్న ఓవైసీ

మసూద్ అజర్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా గుర్తించడం విక్టరీ కాదన్నారు MIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ. మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు భారత్ ఎవరితో రాజీ పడిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మసూద్ విషయంలో చైనా తో జరిగిన డీలింగ్స్ బయటపెట్టాలన్నారు అసదుద్దీన్. బాధితులు భారతీయులైనప్పుడు… అమెరికా, చైనాలతో ఎందుకు రాజీ పడాల్సి వచ్చిందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మసూద్ అజర్, జఖీవుర్ రెహ్మాన్ లక్వీ, హఫీజ్ సయీద్ లాంటివారితో ఇంకా భారత్ కు ప్రమాదం ఉందన్నారు.

Latest Updates