బీజేపీతో దేశానికి నష్టం..యువత మేలుకోవాలి

బీజేపీ సర్కారు దేశ ప్రజలకు తీవ్రంగా నష్టం చేస్తోందని.. అంబేద్కర్ చూపిన అడుగుజాడల్లో కాకుండా ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తోందని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. ఎన్నార్సీ , సీఏఏతో ముస్లింలతోపాటు అన్ని మతాల వారికి కూడా నష్టం జరుగుతుందని..వాటి తర్వాత అలాంటి చట్టాలు మరిన్ని తెస్తారని మండిపడ్డారు. సోమవారం ఆయన మెదక్ పట్టణంలో మున్సి పల్ ఎలక్షన్ల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు చట్టాలకు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని అసద్ ఆరోపించారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని పట్టించుకోవడం లేదన్నారు. అంతా సంఘ్ పరివార్ చేతిలోనే..పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ నుంచి కొత్తగా ఎవరూ వలస రాలేదని.. ఎన్నో ఏండ్లుగా చాలా మంది ఇక్కడే ఉంటున్నారని అసదుద్దీన్ చెప్పారు. ఎన్నార్సీ వంటివి తెస్తే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సంఘ్ పరివార్ చెప్పినట్టుగా బీజేపీ సర్కారు నడుస్తోందని, పౌరసత్వ చట్టం అమల్లోకి వస్తే సంఘ్ పరివార్ చెప్పిన పేర్లు మాత్రమే లిస్టులో ఉంటాయని ఆరోపిం చారు. వారికి నచ్చని వారి పేర్లను తొలగిస్తారన్నా రు. ఈ విషయంలో యువత మేల్కొనాల్సి ఉందని పిలుపునిచ్చారు. కేరళ తరహాలో ఎన్నార్సీ , సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని సీఎం కేసీఆర్ ను కోరామని తెలిపారు.

Latest Updates