శ్రీశ్రీ గాడ్సేకి BJP భారతరత్న ఇస్తుందేమో : అసదుద్దీన్

asaduddin-owaisi-strong-attack-on-sadhvi-godse-deshbhakth-comments

నాథూరాంగాడ్సే దేశ భక్తుడంటూ భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ చేసిన కామెంట్స్ ను తీవ్రంగా తప్పుపట్టారు మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ఇదేదో వెర్రితనంతో చేసిన కామెంట్ కాదు.. ఇది వ్యక్తిగతంగా ఆమె చేసిన వ్యాఖ్య కానేకాదన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో మొట్టమొదటి ఉగ్రవాది నాథూరాం గాడ్సే విషయంలో  ఇదే భారతీయ జనతా పార్టీ స్టాండ్ అని విమర్శించారు అసదుద్దీన్ ఒవైసీ.

ఎన్నికల్లో సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ను నరేంద్రమోడీ స్వయంగా ప్రతిపాదించారని అన్నారు అసదుద్దీన్ ఒవైసీ. “రాబోయే కొన్నేళ్లలో.. శ్రీశ్రీ గాడ్సేకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేయాలంటూ బీజేపీ రికమండ్ చేయబోతోంది” అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

Latest Updates