లాక్ డౌన్ పొడిగిస్తే ప్రతి కార్మికుడికి రూ.5 వేలు ఇవ్వాలి

మ‌రో రెండు వారాల పాటు లాక్ డౌన్ ను పొడిగించే యోచ‌న‌లో కేంద్ర ప్ర‌భుత్వం ఉన్న‌ట్టు తెలిసింది. క‌రోనా ప్ర‌భావం కార‌ణంగా కొ్న్ని రోజుల క్రితం కేంద్ర ప్ర‌భుత్వం దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ ప్ర‌క‌టించింది. వైర‌స్ బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండ‌డంతో లాక్ డౌన్ పొడిగించాల‌ని తెలంగాణ రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలు కోరుతున్నాయి. ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలు ఇప్పటికే ఓ అడుగు ముందుకేసి ఏప్రిల్‌ 30వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించాయి.
లాక్ డౌన్ పొడిగింపు పై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఓ ట్వీట్ చేశారు. ఎలాంటి ప్రణాళిక లేకుండా విధించిన లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా కార్మికులు, వలస కూలీలు తీవ్ర బాధలు పడుతున్నారన్నారు . ఒక‌వేళ‌ లాక్ డౌన్ పొడిగిస్తే మాత్రం ప్రతి కార్మికుడికి రూ. 5 వేలు, అన్నార్థులకు సరిపడా ఆహారపదార్థాలు, వలస కూలీలకు, నిరుపేదలను ఆదుకొనేందుకు రాష్ట్రాలకు తగినన్ని నిధులు ఇవ్వాలని ఓవైసీ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. కాబ‌ట్టి లాక్ డౌన్ పొడిగిస్తే మాత్రం ముందస్తు చర్యలు తీసుకోవాల‌ని ఆయ‌న అన్నారు.

Latest Updates