దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారికి కరోనా టెస్ట్ లు త్వరగా చేయండి

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి త్వరగా కరోనా వైరస్ టెస్ట్ లను నిర్వహించాలని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోగ్యశాఖ మంత్రి ఈటలె రాజేందర్ ను కోరారు.

కరోనా వైరస్ పరీక్షలు  చేస్తున్న చార్మినార్ యునాని, కింగ్ కోటి, సరోజిని దేవి ఐ హాస్పిటల్స్ ను ఓవైసీ సందర్శించారు. అనంతరం ఓవైసీ మాట్లాడుతూ ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్యాలు, గర్భిణీ స్త్రీలు, గుండె, క్యాన్సర్ మరియు డయాలసిస్ రోగులకు టెస్ట్ లు చేయాలని కోరుతూ ట్వీట్ చేశారు.  కరోనా రోగులకు మంచిగా ట్రీట్ మెంట్ అందించే చార్మినార్ యునానిని మొదటి రెఫరల్ ఆస్పత్రిగా మార్చడం వల్ల మౌలిక సదుపాయాల సమస్యలు తీరుతాయని అన్నారు.

Latest Updates