వాళ్లే నిజమైన దేశభక్తులు

న్యూఢిల్లీ: ఆంగన్ వాడీ, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలే నిజమైన దేశభక్తులని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ శుక్రవారం అన్నారు. ప్రజలందర్నీ కరోనా నుంచి సురక్షితంగా ఉంచేందుకు వారు నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. తప్పుడు సమాచారం, భయాందోళనలు కరోనా కన్నా ఎక్కువ డేంజర్ అని, ఇలాంటి సమయంలో కరోనాపై అవగాహన కల్పించడంలో వాళ్లు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. తమ ప్రాణాలను రిస్కులో పెట్టి ధైర్యంగా పని చేస్తున్నారని మెచ్చుకున్నారు. “అవసరమైనప్పుడు ప్రజలకు సేవ చేయడమే దేశభక్తి. మన కమ్యూనిటీ వర్కర్లే నిజమైన దేశభక్తులు. వాళ్లు, వాళ్ల కుటుంబాల త్యాగాలకు దేశం రుణపడి ఉండాలి. కరోనా నుంచి బయటపడిన తర్వాత వాళ్ల వర్కింగ్ కండిషన్లలో మార్పులు తీసుకురావాలి. కమ్యూనిటీ వర్కర్లు అందరికీ సెల్యూట్ చేస్తున్నా. వాళ్లు, వాళ్ల ఫ్యామిలీలు సురక్షితంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నా” అని రాహుల్ గాంధీ అన్నారు.

Latest Updates