శిశువుకు శానిటైజ‌ర్ క‌లిపిన వాట‌ర్ తాగించిన ఆశావ‌ర్క‌ర్

త్రిపుర‌లో దారుణం జ‌రిగింది. ఓ ఆశావ‌ర్క‌ర్ శానిటైజ‌ర్ క‌లిపిన వాట‌ర్ ను 10 నెల‌ల ప‌సికందుకు తాగించాడు. త్రిపుర ఊన‌కోటి జిల్లా సోనైమురి గ్రామంలో ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి ఓ మ‌హిళ త‌న శిశువుకు పోలియా డ్రాప్స్ వేయించేందుకు వ‌చ్చింది. పోలియా డ్రాప్స్ వేయించిన త‌రువాత చిన్నారికి దాహం వేస్తుందంటూ ఆ మ‌హిళ ఆశా వ‌ర్క‌ర్ దాస్ ను వాట‌ర్ ఇవ్వాల‌ని కోరింది. దీంతో దాస్ స‌ద‌రు మ‌హిళ‌కు శానిటైజ‌ర్ క‌లిపిన వాట‌ర్ బాటిల్ అందించాడు. ఆ వాట‌ర్ తాగిన శిశువు అనారోగ్యం పాలైంది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన మ‌హిళ ఆస్ప‌త్రికి త‌ర‌లించింది. ట్రీట్మెంట్ చేసిన వైద్యులు శానిటైజ‌ర్ క‌లిపిన వాట‌ర్ తాగ‌డం వ‌ల్లే చిన్నారి అనారోగ్యం పాలైన‌ట్లు డాక్ట‌ర్లు నిర్ధారించారు. దీంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన శిశువు కుటుంబ‌స‌భ్యుల‌కు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

Latest Updates