ఫిక్స్‌డ్ శాలరీల కోసం ఆశా వర్కర్ల నిరసన… అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్: పనికి తగిన వేతనం కాకుండా.. ఫిక్స్ డ్ శాలరీలు ఇవ్వాలంటూ ఆశావర్కర్లు నిరసన తెలిపారు. శుక్రవారం పొద్దున హైదరాబాద్ కోఠి లోని  డైరెక్టరేట్ హెల్త్ ఆఫీస్ ముందు ఆశావర్కర్లు ధర్నాకు ప్రయత్నించారు. సుమారు వెయ్యి మంది ఆశా వర్కర్లు తమ డిమాండ్ల పరిష్కారానికి కోఠికి వచ్చారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. ధర్నాకు అనుమతి లేదని… వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

జగిత్యాల: ఆశా వర్కర్లు ఈరోజు అసెంబ్లీ ముట్టడికి వస్తున్నారని తెలిసి జగిత్యాల నుంచి వస్తున్న  వారిని అక్కడే కట్టడిచేశారు పోలీసులు. జిల్లా కేంద్రాల్లో  ఉదయాన్నే పికెటింగ్  ఏర్పాటు  చేసిన పోలీసులు…  జగిత్యాలలో  ముప్పై మంది  ఆశావర్కర్లను  అరెస్ట్ చేసి స్టేషన్ లో ఉంచారు. స్థిరమైన వేతనాలు  ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఆశా వర్కర్లు.

Latest Updates