మీ సేవ‌కు స‌లాం : 7కి.మి గ‌ర్భిణీని మోశారు

భ‌ద్రాద్రి జిల్లాలోహృద‌య విదార‌క ఘ‌ట‌న జ‌రిగింది. ములక‌ల‌ప‌ల్లి మండ‌లం, పుసుగూడెంలో ఓ గ‌ర్భ‌ణికి పురిటినొప్పులు రాగా అక్క‌డ ర‌వాణా సౌక‌ర్యం లేక‌పోవ‌డంతో విష‌యం తెలిసిన ఆశా వ‌ర్క‌ర్లు, అంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌లు అక్క‌డికి చేరుకున్నారు. జోలి క‌ట్టి 7 కిలీ మీట‌ర్లు ఆ గ‌ర్భిణీని న‌డుచుకుంటూ హ‌స్పిట‌ల్ ప్రాధ‌మిక ఆరోగ్య కేంద్రానికి త‌ర‌లించి ట్రీట్ మెంట్ అందించారు.

మ‌హిళ‌కు పండంటి ఆడ‌ బిడ్డ పుట్ట‌గా త‌ల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నార‌ని ఆల‌స్యం అయితే మ‌హిళ ప్రాణానికే ప్ర‌మాదం ఉండేద‌ని తెలిపారు డాక్ట‌ర్లు. దీంతో ఆశావ‌ర్క‌ర్లు, అంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌ల‌ను అంద‌రూ మెచ్చుకుంటున్నారు.

Latest Updates