అశోక్‌‌‌కుమార్‌ ఔట్‌ !

ఇంటర్మీడియట్‌ ఫలితాలపై ఆందోళనల నేపథ్యంలో సర్కారు నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌‌‌‌కుమార్‌ ను సమస్యకు ప్రధాన బాధ్యుడిగా గుర్తిస్తూ బాధ్యతలన్నింటి నుంచి తప్పించింది. రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ తోపాటు అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహణ బాధ్యతలను విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌ రెడ్డికి అప్పగించింది. ఇదే అంశంపై సోమవారం హైకోర్టులో కేసు విచారణకు రానుంది. కోర్టుకూడా ఉచితంగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌ కు ఆదేశాలు ఇచ్చే అవకాశముండటంతో దానికిముందే సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రగతిభవన్‌ లో జరిగిన సమీక్షా సమావేశంలో విద్యాశాఖ అధికారులపై  సీఎం సీరియస్‌ అయినట్టు తెలిసింది.

డేటా సాఫ్ట్‌‌‌‌వేర్‌ సంస్థ గ్లో బరీనాకున్నమెరిట్స్‌ , డీమెరిట్స్‌ కూడా తెలుసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఇంటర్‌ బోర్డును తీసేయ్యాలన్న ప్రతిపాదన కూడా సీఎం నుంచి వచ్చినట్టు తెలిసింది. దానిస్థానంలో ప్రత్యేకంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎగ్జామ్స్‌ బోర్డుఏర్పాటుపై సమాలోచనలు చేయాలని విద్యాశాఖాధికారులను సీఎం ఆదేశించారు. ఎస్‌ ఎస్‌ సీబోర్డులో విలీనం చేస్తే ఎదురయ్యే సమస్యలపై ఆరా తీశారు. మరోపక్క టీఎస్‌ టీఎస్‌ ఎండీ వెంకటేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సమావేశమైంది. ఫలితాల వెల్లడి లో తప్పులు జరిగాయని ఈ కమిటీ గుర్తించినట్టు సమాచారం. దీనిపై నివేదికను సర్కారుకు గురువారం అందించే అవకాశమున్నది. కమిటీ నివేదిక ఆధారంగా బోర్డులోని పలువురు అధికారులు, గ్లో బరీనా సంస్థలపై చర్యలు తీసుకునే అవకాశముంది.

Latest Updates