ఏడీబీ వైస్ చైర్మన్‌గా ఎన్నికల కమిషనర్ లావాసా

న్యూఢిల్లీ: ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసాను ఏషియా డెవలప్‌మెంట్ బ్యాంక్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా నియమిస్తున్నట్లు రీజనల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ బుధవారం ప్రకటించింది. దీంతో ఎన్నికల కమిషనర్‌‌ బాధ్యతల నుంచి తప్పుకొని.. ప్రైవేట్ సెక్టార్స్‌తోపాటు పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌‌షిప్స్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా అశోక్‌ కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు. తమ పదవీ కాలం ముగియక మునుపే పోల్ ప్యానెల్ నుంచి తప్పుకోనున్న రెండో ఎలక్షన్ కమిషనర్‌‌గా అశోక్‌ను చెప్పొచ్చు. ఇంతకుముందు 1973లో చీఫ్​ ఎలక్షన్ కమిషనర్‌‌గా ఉన్న నాగేంద్ర సింగ్ హేగ్‌లోని ఇంటర్నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్​ జస్టిస్‌లో జడ్జిగా నియమితులై కమిషనర్‌‌గా బాధ్యతల నుంచి వైదొలగవలసి వచ్చింది. రిటైర్డ్‌ ఐఏఎస్ ఆఫీసర్ అయిన అశోక్ 2018 జనవరిలో ఎన్నికల కమిషనర్‌‌గా నియమితులయ్యారు.

Latest Updates