
వెలుగు, కోటపల్లి: ప్రిన్సిపాల్ వేధిస్తున్నారని, సరిగా అన్నం పెట్టడడం లేదని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు బుధవారం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఆయన వద్దంటూ.. మహిళా ప్రిన్సిపాల్ ను నియమించాలని డిమాండ్ చేశారు. రెండు రోజులుగా ధర్నా చేస్తామని చెబుతుంటే ప్రిన్సిపాల్ తమకు టీసీ ఇస్తానని బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ స్కూల్ ను ఉన్నతాధికాలెవరూ పట్టించుకోవడం లేదని, న్యాయం చేసేందుకు ఐటీడీఏ పీఓ జోక్యం చేసుకొని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ప్రస్తుత ప్రిన్సిపాల్ తీరుతో సరిగా చదువుకోలేపోతున్నామని వాపోయారు. కోటపల్లి ఎస్ఐ రాజేందర్ వెళ్లి విద్యార్థినులకు నచ్చచెప్పి పంపించారు. వేధిస్తున్న ప్రిన్సిపాల్ అశోక్ ను వెంటనే సస్పెండ్ చేయాలని లంబాడీ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు సమ్మయ్య నాయక్ డిమాండ్ చేస్తూ డీటీడీవోకు మెమోరాండం అందించారు.