సమ్మె విరమిస్తాం.. కండిషన్స్ పెట్టొద్దు : అశ్వత్థామ

అక్టోబర్ 4 ముందు ఉన్న పరిస్థితులు ఆర్టీసీలో ఉంటే వెంటనే తాము సమ్మెను విరమిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్  అశ్వత్థామరెడ్డి తెలిపారు. సమ్మెపై విచారణ చేపట్టాలని హైకోర్ట్ లేబర్ కోర్ట్ కు ట్రాన్సఫర్ చేసింది. ఈ సందర్భంగా కోర్ట్ తీర్పును తాము గౌరవిస్తున్నట్లు తెలిపారు. కార్మికుల డిమాండ్లను అన్నీ లేబర్ కోర్ట్ అందజేసినట్లు చెప్పారు. లేబర్ కోర్ట్ లో తమకు న్యాయం జరుగుతుందన్న అశ్వత్థామరెడ్డి.. కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఎలాంటి షరతులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో  కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు.

షరతులు విధిస్తూ సంతకాలు పెట్టమన్నా సహించేది లేదన్నారు. కార్మికులు సంతకాలు పెట్టాల్సి వస్తే అటెండెన్స్ రిజిస్టర్ తో తప్పా ఎక్కడా సంతకాలు పెట్టరని అన్నారు.

ప్రభుత్వం త్వరగా కార్మికుల్ని విధుల్లోకి ఆహ్వానిస్తే సమ్మె విరమించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అప్పటి వరకు ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె కొనసాగుతున్నట్లు అశ్వత్థామరెడ్డి చెప్పారు.

Latest Updates