నిత్యానందా.. నీ కైలాసం వచ్చుడెట్లా?: అశ్విన్

నిత్యానంద భారత్ నుంచి పారిపోయి.. కైలాసం అనే పేరుతో దేశాన్ని స్థాపించాడన్న వార్తలపై క్రికెటర్ అశ్విన్ రవిచంద్రన్ స్పందించాడు. ‘నీ దేశానికి రావాలంటే వీసా ప్రొసీజర్ ఏంటీ? అక్కడికి వచ్చాక ఆన్ అరైవల్ వీసా ఇస్తారా?’ అంటూ సెటైరికల్‌గా ట్వీట్ చేశాడు.

అశ్విన్ ట్వీట్‌ వైరల్‌గా మారింది. వేల మంది నెటిజన్లు లైకులు, రీట్వీట్లు చేస్తున్నారు. ట్వీట్‌కు ఫన్నీ కామెంట్లు వస్తున్నాయి. ‘అక్కడికి వెళ్లడం సులువే.. కానీ, వెళ్లాక తిరిగి రావడమే కష్టం’ అని ఒకరు కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన అశ్విన్.. కైలాసంలో పెట్టుబడులు పెడితే ఏవైనా బెనిఫిట్స్ ఉంటాయా అని అడిగాడు.

MORE NEWS:

కైలాస దేశం: రాజు, దేవుడు నిత్యానంద.. ప్రధాని ఓ కోలీవుడ్ నటి!

స్త్రీని భోగవస్తువులా చూడకూడదు.. మగవాడు కట్టుబాట్లు పాటించాలి

ఏం అక్కడ క్రికెట్ అకాడమీ పెడతారా అని కొందరు, ఆ దేశం పౌరసత్వం తీసుకుంటారా అని మరికొందరు ప్రశ్నించగా.. ద్వంద్వ పౌరసత్వానికి భారత్‌లో అనుమతి లేదు కదా అని సమాధానమిచ్చాడు అశ్విన్.

Latest Updates