అయ్యప్ప పడిపూజ : మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ఏఎస్ఐ

మద్యం మత్తులో బాధ్యత గల పోలీసు అధికారి చిందులు వేసాడు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం పీఎస్ పరిధిలోని వి.వెంకటాయపాలెం గ్రామంలో అయ్యప్పభక్తులు పడిపూజ నిర్వహించారు. పడి పూజ నిర్వహించేందుకు అయ్యప్పభక్తులు పర్మీషన్ తీసుకున్నారు. అయితే పడిపూజకు అనుమతిలేదంటూ మద్యం మత్తులో ఏఎస్ఐ డానియల్ వీరంగం సృష్టించాడు. పడిపూజకు పర్మిషన్ లేదంటూ నోటికొచ్చినట్లు మాట్లాడాడు. అయ్యప్ప మండపంలోనికి బూట్లతో వచ్చాడు…నోటికి పని చెప్పాడు….హరతి సమయం మించిపోతుందని అయ్యప్పలు సముదాయించినా మద్యం మత్తులో వినిపించుకోలేదు.

మైక్ తొలగిస్తామని దుర్బషలాడటంతో సహనం కోల్పోయిన అయ్యప్పలు డానియల్ ను భయటకు పంపారు.  ఏఎస్ఐ అత్యుత్సాహన్ని అయ్యప్పలు అధికారులకు తెలిపారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసు ఉన్నతాధికారులు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. రఘునాథ పాలెం ఎస్సై  అయ్యప్పల విషయంలో జరిగిన తప్పిదంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తానని హమీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

Latest Updates