క్వార్టర్స్ లోనే ఇంటి దారి పట్టిన సైనా, సింధు, సమీర్

Asia Badminton Championship: Indian Challenge Over as Sindhu, Saina and Sameer Lose

వుహాన్‌ : భారీ అంచనా లో ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌ లో బరిలోకి దిగిన ఇండియా షట్లర్ లు ఒట్టి చేతులతో ఇంటిదారి పట్టారు. స్టార్‌ ప్లేయర్లు సైనా నెహ్వాల్‌ , పీవీ సింధుతో పాటు సమీర్‌ వర్మ క్వార్టర్‌ ఫైనల్లోనే ఓడిపోవడంతో మెగా టోర్నీలో ఇండియా పోరాటం ముగిసింది.

శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వా ర్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏడో సీడ్‌ సైనా నెహ్వాల్‌ 13–21,23–21, 16–21తో మూడో సీడ్‌ అకానె యమగుచి(జపాన్‌ ) చేతిలో మూడు గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల పాటు పోరాడిఓడిపోయిం ది. 69 నిమిషాల మారథాన్‌ మ్యాచ్‌ లో అకానెకు సైనా గట్టి పోటీ ఇచ్చింది. మొదటి గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇద్దరూ ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పది పాయింట్ల వరకూ చెరో పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలుస్తూ వచ్చారు. అయితే, ఒక్కసారిగా విజృంభించిన జపాన్‌ షట్లర్‌ వరుసగా ఎనిమిది పాయింట్లు నెగ్గి గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాతాలో వేసుకుంది. రెండో గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఇద్దరూ పోటాపోటీగా ఆడారు. 21–21తో సమంగా నిలిచిన దశలో.. వరుసగా రెండు విన్నర్ లు కొట్టిన సైనా గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచి మ్యాచ్‌ లో నిలిచింది. అదే జోరుతో మూడో గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 7–2తో ముందంజ వేసింది. తర్వాత ఆధిక్యాన్ని 14–11కి పెంచుకొని మ్యాచ్‌ నెగ్గేలా కనిపించింది. కానీ, పోరాటం వదలని అకానె.. గొప్పగా పుంజుకుం ది. 17–14తో తొలిసారి ఆధిక్యం లోకి వచ్చిన ఆమె సైనాకు ఎలాం టి చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వకుండా గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మ్యాచ్‌ ను ఖాతాలో వేసుకుం ది.

మరో మ్యాచ్‌ లో నాలుగో సీడ్‌ సిం ధు 19–21, 9–21తో అన్‌ సీడెడ్‌ కైయన్యన్‌ (చైనా) చేతిలో అనుహ్యం గా చిత్తయింది. అనామక ప్లేయర్‌ తో పోటీ కావడంతో సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరి పతకం ఖాయం చేస్తుందని భావిస్తే సింధు పూర్తిగా చేతులెత్తేసిం ది. తొలి గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాస్త పోరాడిన ఆమె..సెకండ్‌ గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తొలి ఏడు పాయింట్ల తర్వా త ప్రత్యర్థికి సరెండర్‌ అయిపోయింది.

ఇక పురుషుల క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సమీర్‌ వర్మ 10–21, 12–21తో రెండో సీడ్‌షి యుకీ (చైనా) చేతిలో వరుస గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో పరాజయం పాలయ్యాడు.

Latest Updates