క‌రోనా సంక్షోభంలోనూ ఉద్యోగుల‌కు జీతాలు పెంచిన‌ ఏషియ‌న్ పేయింట్స్

ముంబై: క‌రోనా సంక్షోభంలో దేశ వ్యాప్తంగా అనేక ప‌రిశ్ర‌మలు, వ్యాపారాల‌ను కుంగదీస్తుంటే..ఏషియ‌న్ పేయింట్స్ మాత్రం మ‌రో దారిలో న‌డుస్తోంది. ప్ర‌స్తుత క‌ష్ట‌కాలంలోనూ త‌మ సంస్థ‌లో పని చేస్తున్న ఉద్యోగుల వేత‌నాలు పెంచి వారిలో ఆత్మ‌స్థైర్యాన్ని నింపే ప్ర‌య‌త్నం చేసింది. అమ్మ‌కాల సిబ్బందికి బీమాతో పాటు హాస్పిట‌ల్ ఖ‌ర్చుల‌కు కూడా సాయం చేస్తామ‌ని చెప్పింది. కోవిడ్-19పై పోరాటం కోసం కేంద్రం, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు రూ.35 కోట్ల విరాళం ఇచ్చినట్లు తెలిపింది ఏషియ‌న్ పేయింట్స్.

Latest Updates