రెజ్లింగ్‌ లో సాక్షి, వినేశ్‌ కు కాంస్యాలు

asian-wrestling-championship:-sakshi,-vinesh-grab-bronze

 

జియాన్‌ (చైనా): ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌ షిప్​లో ఇండియా మహిళలు స్వర్ణం లేకుండానే పోరాటం ముగించారు. గోల్డ్‌ మెడల్‌ తెస్తారని ఆశలు పెట్టుకున్న సాక్షి మాలిక్‌ , వినేశ్‌ ఫోగట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా కాంస్యాలతోనే సరిపెట్టా రు. సాక్షి(62 కేజీలు), వినేశ్‌ (53కేజీలు) ఇద్దరూ శుక్రవారం జరిగిన తమ క్వార్టర్‌ ఫైనల్‌ బౌట్స్​లో ఓడిపోయారు. అయితే వీరి ప్రత్యర్థులు ఫైనల్​  చేరడంతో రెపిచేజ్‌ లో ఆడి కాంస్య పతకాలు సాధించారు. కాంస్య  పతక పోరులో వినేశ్‌ 8-–1తో కినైయ్‌ పంగ్‌ (చైనా )పై విజయం సాధించగా, సాక్షి 9–6తో హ్యోన్‌ గ్యోం గ్‌ మన్‌ ( ఉత్తర కొరియా)పై గెలిచింది. మంజు కుమారి(59 కిలోలు), దివ్యాకక్రాన్‌ (68 కిలోలు) కూడా కంచు పతకాలు నెగ్గిన సంగతి తెలిసిందే.

Latest Updates