పొట్టి కారు..1.69 సెకన్ లోనే 100 కి.మీ స్పీడ్

స్పీడ్​ థ్రిల్స్​.. బట్​ కిల్స్​.. కానీ, ఆ స్పీడంటేనే నేటి కుర్రకారుకు జోరు. ప్రపంచంలోని లగ్జరీ కార్లు, బైకుల కంపెనీలు ఫీచర్లతో పాటు స్పీడ్​నూ ముఖ్యమైన పారామీటర్​గా తీసుకుంటాయి. ఇన్ని సెకన్లలో ఇంత స్పీడ్​ అందుకుంటదంటూ యాక్సిలరేషన్​పై ప్రచారం చేస్తుంటాయి. మరి, ప్రపంచంలోని అత్యంత ఫాస్టెస్ట్​ యాక్సిలరేషన్​ కారేంటి? అంటే తమదే అంటోంది జపాన్​కు చెందిన యాస్పార్క్​ అనే కంపెనీ. ఆ కారుపేరు యాస్పార్క్​ ఓల్​. ఈ కారు జస్ట్​ 1.69 సెకన్లలోనే వంద కిలోమీటర్ల వేగాన్ని దుకుంటుందట. పూర్తి ఎలక్ట్రిక్​ కారిది. ఇప్పటిదాకా రిమాక్​ అనే కంపెనీకి చెందిన కాన్సెప్ట్​ టూ, టెస్లా రోడ్​స్టర్​లు అత్యంత వేగవంతమైన యాక్సిలరేషన్​ ఉన్న కార్లుగా ప్రకటించుకున్నాయి.ఆ కార్లు వరుసగా 1.85 సెకన్లు, 1.9 సెకన్లలో వంద మార్కును అందుకుంటాయట. ఇప్పుడు ఆ రెండింటిని ఓల్​ దాటేసింది. నిజానికి 2017లోనే దాని ప్రొటోటైప్​ను తయారు చేసింది యాస్పార్క్​. ఇప్పుడు దుబాయ్​లో జరుగుతున్న వరల్డ్​ ప్రీమియర్​ కార్​ షోలో ప్రదర్శించింది.మొత్తంగా గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ఓల్​ దూసుకుపోతుందని యాస్పార్క్​ ప్రకటించింది. ఈ కారుకు ఇంకో ప్రత్యేకతా ఉంది. ప్రపంచంలో అత్యంత పొట్టి కారు కూడా ఇదేనట. అవును, జస్ట్​ మూడు అడుగుల ఎత్తు (99 సెంటీమీటర్లు) మాత్రమే ఉంటుందట. అంతేగాకుండా 120 కిలోల బరువే ఉంటుందట. దీంతో తక్కువ బరువున్న కారుగానూ అది రికార్డు కొట్టేస్తుందట. కంపెనీ కేవలం 50 కార్లనే తయారు చేసింది.కారు ధర కూడా అదే రేంజ్​లో ఉంది. దాదాపు రూ.22 కోట్ల 85 లక్షలు. అంటే 31 లక్షల 90 వేల డాలర్లు.

Latest Updates