కొత్త పథకం: పెళ్లి కుమార్తెకు తులం బంగారం

assam-to-gift-1-tola-gold-to-brides-from-all-communities

బాలికల అభివృద్ధికి… వారి చదువులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రోత్సహించేందుకు వినూత్న పథకాన్ని ప్రవేశ పెట్టింది అస్సాం ప్రభుత్వం. రాష్ట్రంలో పెళ్లి చేసుకోబోయే ప్రతి వధువుకు 10 గ్రాముల బంగారం కానుకగా అందించాలని నిర్ణయించింది. అరుంధతి బంగారు పథకం పేరుతో తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా బాల్యవివాహాలను అరికట్టడం తోపాటు మహిళా సాధికారత లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం సంవత్సరానికి 800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఈ పథకానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, ఇది 2020 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమంత బిశ్వశర్మ.

ఈ పథకానికి సంబంధించి అర్హతలతో పాటు కొన్ని  విధివిధానాలు కూడా  మంత్రి ప్రకటించారు.  వధువు కనీస వయస్సు 18 ఏళ్లగా ఉండటంతో పాటు 10వ తరగతి వరకు చదువుకొని ఉండాలన్నారు. తండ్రి, తల్లి వార్షిక ఆదాయం రూ. 5 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉండాలని తెలిపారు. అంతేకాదు వివాహాన్ని తప్పనిసరిగా నమోదు చేయించాలన్నారు.

అంతేకాదు మ్యారేజ్ సమయంలో  రూ. 30 వేల నగదును ప్రభుత్వం వధువు అకౌంట్‌లో డిపాజిట్ చేయనుంది ప్రభుత్వం. ఇకపై ప్రతి ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో..అప్పుడు ఉన్న బంగారం ఖరీదును బట్టి..పథకం ద్వారా ఇచ్చే నగదులో మార్పులు ఉంటాయి.  ఇది మొదటి వివాహ సందర‍్భంగా మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ పథకం అమల్లోకి రానున్న ఈ పథకంలో ప్రాథమికంగా టీ గార్డెన్‌, ఆదివాసీ గిరిజనులకు కనీస విద్యార్హత నిబంధనను సడలిస్తున్నట్టు మంత్రి తెలిపారు. 1954 ప్రత్యేక వివాహ నిబంధనల ప్రకారం వివాహాలను అధికారికంగా నమోదు చేసిన తర్వాత ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చన్నారు.

Latest Updates