అస్సాం మాజీ సీఎం అన్వర తైమూర్ మృతి

అస్సాం మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్రానికి ఇప్పటి వరకూ ఏకైక మహిళా సీఎం సైదా అన్వర్ తైమూర్ మరణించారు. ఆమె వయస్సు84 ఏళ్లు. అస్సాంలో  సైదా అన్వర్ తైమూర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా 40 ఏళ్ల పాటు పనిచేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె.. అస్సా మొదటి సీఎంగా సేవలందించారు. గత కొన్నేళ్లగా ఆస్ట్రేలియాలో ఉంటున్న తన కొడుకు దగ్గర ఉంటున్నారు సైదా అన్వర్ తైమూర్. కొద్ది రోజుల కిందట అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కన్నుమూశారు.

తైమూర్ మృతి పట్ల ప్రధాని మోడీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, తదితరులు సంతాపం తెలిపారు. ఆమె అస్సాం అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు.

Latest Updates