అసెంబ్లీ రేపటికి వాయిదా

హైదరాబాద్‌ : అసెంబ్లీ సమావేశం గురువారానికి వాయిదా పడింది. సభలో బుధవారం కొత్త రెవెన్యూ బిల్లు 2020ను సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టారు. అంతకుముందు సభలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ కొనసాగాయి. కొత్త రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం కరోనాపై స్వల్ప కాలిక చర్చను ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. సభ్యులు మాట్లాడిన అనంతరం సీఎం కేసీఆర్‌ వివరణ ఇచ్చారు. ఆ తర్వాత సభను గురువారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి.

Latest Updates