అసెంబ్లీ, శాసన మండలి రేపటికి వాయిదా

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి(ఆదివారం) వాయిదా పడ్డాయి. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలు ముగియగానే రాష్ట్ర బడ్జెట్ పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. తర్వాత అసెంబ్లీ రేపటికి వాయిదా వేశారు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి. రేపు ఉదయం 10గంటలకు తిరిగి ప్రారంభమవుతుంది.

అంతకు ముందు తెలంగాణ శాసనమండలి కూడా రేపటికి వాయిదా పడింది. ఇవాళ మండలిలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చర్చ జరిగింది. తర్వాత శాసనమండలిని రేపటికి వాయిదా వేశారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.

Latest Updates