ఆస్తమా పేషెంట్లకు కరోనాతో ప్రమాదమా?

న్యూఢిల్లీ: ఆస్తమాతో బాధపడుతున్నారా? కరోనా వస్తే ఇబ్బందని భయపడుతున్నారా? దిగులు పడకండి. ఆస్తమా పేషెంట్స్‌‌కు కరోనా వచ్చే అవకాశాలు చాలా తక్కువని ఓ పరిశోధన వెల్లడించింది. గత నెల 24వ తేదీన జర్నల్ ఆఫ్ అలర్జీ అండ్ క్లినికల్ ఇమ్యూనాలజీలో ఈ నివేదిక పబ్లిష్ అయ్యింది. శ్వాసనాళాల ఉబ్బసంతో బాధపడుతున్న వారి మీద శాస్త్రవేత్తలు నిర్వహించిన స్టడీలో ఈ విషయాలు తెలిశాయి. ఇందుకోసం ఇజ్రాయెల్‌‌లో దేశంలోని ప్రజల హెల్త్ మెయింటెన్స్ డేటాను సైంటిస్టులు పరిశీలించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు కరోనా బారిన పడిన పేషెంట్ల వివరాలను పరిశీలించి నివేదికను రూపొందించారు. దీని ప్రకారం ఇజ్రాయెల్‌‌లో కరోనా పాజిటివ్‌‌లుగా తేలిన వారిలో 6.75 శాతం మంది మాత్రమే ఆస్తమా పేషెంట్లు ఉన్నారు. దీన్ని బట్టి ఆస్తమా ఉన్న వారికి కరోనా వచ్చే అవకాశాలు స్వల్పమని సైంటిస్టులు తేల్చారు. అయితే ఈ విషయంపై మరింత స్పష్టతకు వచ్చేందుకు లోతుగా పరిశోధన చేయాల్సి ఉందన్నారు.

Latest Updates