కప్ ముంబైదేనట : జ్యోతిష్యుడు కామెంట్స్

హైదరాబాద్‌ :  ఉప్పల్ వేదికగా మరికొద్ది సేపట్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ పైనల్ మ్యాచ్ పై వరల్డ్ వైడ్ గా ఆసక్తి నెలకొంది. కప్ ఎవరి సొంతమోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కోట్లల్లో బెట్టింగ్ లు జరుగుతున్నప్పటికీ..ఓ జ్యోతిష్యుడు చేసిన కామెంట్స్ కి హాట్ ఫెవరేట్ అయ్యింది ముంబై ఇండియన్స్. నేడు చెన్నై వర్సెస్ ముంబై నువ్వా నేనా అనేలా తలపడనుండగా..పక్కాగా ముంబై గెలుస్తుందని ఓ జ్యోతిష్యుడు జోష్యం చెప్పాడు. ఇంకేముందు బెట్టింగు రాయుళ్లు రెచ్చిపోయి ముంబైపైనే వేసుకుంటున్నారని టాక్.

2013, 2015 సీజన్ల మాదిరిగానే విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్‌ ఈసారి కూడా ఛాంపియన్‌గా అవతరించే అవకాశాలున్నాయని జ్యోతిషుడు గ్రీన్‌స్టోన్‌ లోబో తెలిపారు. భారత క్రికెట్‌ టీమ్ లో జాతకం ప్రకారం ధోనీ కంటే ఎక్కువ ట్రోఫీలు గెలిచే అదృష్టం ఒక్క రోహిత్‌శర్మకు మాత్రమే ఉందన్నారు. రోహిత్‌ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో ఉత్తమ కెప్టెన్‌ అవుతాడని తెలిపారు.  ఈసారి గ్రహాలన్నీ ముంబయి ఇండియన్స్‌కే అనుకూలంగా ఉన్నాయని, జట్టులో ఆటగాళ్ల వయసు సగటు తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని చెప్పారు. గత సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఛాంపియన్‌గా అవతరించినా.. ఈసారి దాన్ని రిపీట్ చేసే అవకాశాలు లేవన్నారు.

2018 ధోనీ విజయానికి సహకరించిన యరేనస్‌ గ్రహం.. 2019లో రోహిత్‌శర్మకు అనుకూలంగా ఉందని ఆయన తెలిపారు. అయితే, అభిమానులు మాత్రం ఇదంతా ట్రాష్‌ అంటున్నారు. గతేడాది ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ సందర్భంగానూ ఈయన జ్యోతిషం చెప్పారు. అది ఫెయిల్ అయ్యిదని సీరియస్ అవుతున్నారు. మరి చూడాలి ఈ జ్యోతిష్యుడి లెక్కల ప్రకారం ఏ మ్యాచ్ గెలుస్తుందో.