బెంగళూరు రోడ్డుపై వ్యోమగామి

మన చుట్టు పక్కల పరిస్థితులు సరిగా లేకపోయినా… అధికారులు పట్టించుకోక పోయినా నిరసన వ్యక్తం చేస్తుంటారు. నిరసనలు కొందరు కొన్ని రకాలుగా వ్యక్తం చేస్తుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం వినూత్నంగా వ్యక్తం చేశాడు. చంద్రుడిపై నడుస్తున్న వ్యోమగామిలా రెడీ అయ్యాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. అక్కడి రోడ్ల పరిస్థితిపై ఎన్నో సార్లు అధికారులకు తెలియజేసినా అధికారులు పట్టించుకోక పోవడంతో ఆర్టిస్టు, సామాజిక కార్యకర్త బాదల్ నంజుందస్వామి అనే వ్యక్తి వ్యోమగామిలా తయారైయ్యాడు. అంతరిక్షంలో వేరే గ్రహం పై ఎలా నడుస్తారో అలా … బెంగళూరులోని గుంతల రోడ్లపై జాగ్రత్తగా నడిచి నిరసన వ్యక్తం చేశాడు.

వర్షాల కారణంగా రోడ్లు ఎంత అధ్వాన్నంగా తయారయ్యాయో చెప్పడానికి నంజుందస్వామి వ్యోమగామిలా రోడ్డుపై నడిచాడు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  అంతేకాదు ఈ వీడియోను నాసా, ఇస్రో,స్పేస్ ఎక్స్ లను ట్యాగ్ చేశాడు నంజుందస్వామి.

Latest Updates