విశ్వ ‘మూల’కం దొరికింది

Astrophysical detection of the helium hydride ion HeH+

హీలియం హైడ్రైడ్ ను గుర్తించిన సైంటిస్టులు

ఏమీలేని చోట అణువు..అణువు కలిసి పెద్ద ‘ప్రపంచం’ ఏర్పడింది. దానినే మనం విశ్వం అంటున్నాం. దానికి మూలం ఓ మూలకం! ఆ మూలకం హీలియం హైడ్రైడ్ (హెచ్ ఈహెచ్ +) అని తొలిసారి సైంటిస్టు లు గుర్తించారు. 1400 కోట్ల ఏళ్ల క్రితం విశ్వం పుట్టుకలో తొలి మూలకం అదే అని తేల్చారు. బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు హైడ్రోజన్ అయాన్లు, హీలియం న్యూట్రాన్లు కలిసి హీలియం హైడ్రైడ్ గా ఏర్పడినట్టు తేల్చారు. జర్మనీలోని మ్యాక్స్​ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ రేడియో ఆస్ట్రానమీ సైంటిస్టులు విశ్వం పుట్టుకకు కారణమైన ఈ తొలి మూలకాన్ని ఎన్ జీసీ 7027 నక్షత్ర మండలంలోగుర్తించారు. ఇన్నాళ్లూ సైంటిస్టులకు చిక్కకుండా దోబూచులాడిన ఆ మూలకపు ఆనవాళ్లను ఎట్టకేలకు విజయవంతంగా గుర్తించగలిగారు.

ప్రస్తుతం కక్ష్యలో తిరుగుతున్న సోఫియా అబ్జర్వే టరీలోని గ్రేట్ఇన్ ఫ్రారెడ్ స్పెక్ట్రో మీటర్ ఈ మూలకాన్ని గుర్తించింది. విశ్వం ఏర్పడిన కొత్తలో ప్రోటాన్లు లేదా అయాన్ల రూపంలోనే హైడ్రోజన్ ఉండేదని, అయితే, స్వేచ్ఛా ఎలక్ట్రాన్లతో హీలియం కలవడం ద్వారా స్థిర అణువులు ఏర్పడ్డా యని సైంటిస్టులు వివరించారు. 1925లోనే ప్రారంభమైన ఈ మూలకపు పరిశోధనలు ప్రారంభమైనా సైంటిస్టులకు నిరాశే మిగిలింది. 1970ల్లో హీలియం హైడ్రైడ్ ఆనవాళ్లున్నాయని గ్రహించినా దానికి సరైన ఆధారాలను మాత్రం చూపించలేకపోయారు. ఇప్పుడు టెరాహెర్ట్జ్ టెక్నాలజీ మరింత ఆధునికతను సంతరించుకోవడంతో హై రిజల్యూషన్ స్పెక్ట్రోస్కో పీ ద్వారావాటిని గుర్తించడం తేలికైందని సైంటిస్టులు అంటున్నారు.

 

Latest Updates