బయటపడుతున్న కరోనా లక్షణాల్లేని కేసులు

చాన కరోనా కేసులు లక్షణాల్లేనివే
దేశంలో కరోనా సోకిన 80% మంది అసింప్టమాటికే
మహారాష్ట్రలో 70% , కర్నాటకలో 60% ఇట్లాంటి కేసులే
అసింప్టమాటిక్‌ వ్యక్తుల నుంచి వృద్ధులు, రోగాలున్నోళ్లకు వ్యాప్తి
ప్రీ సింప్టమాటిక్ స్టేజ్‌ నుంచి ఎక్కువ మందికి అంటుకునే చాన్స్‌
సోషల్‌డిస్టెన్స్‌ పాటించాలి, జాగ్రత్తగా ఉండాలంటున్న సైంటిస్టులు

ఆయన పేరు మహేశ్. ప్రైవేట్‌ ఎంప్లాయ్‌. లాక్‌‌డౌన్‌‌ పెట్టినప్పటి నుంచి అస్సలు బయటకు పోలేదు. పాలు, కూరగాయలే కొనుక్కొని వచ్చేది. ఆయన ఉంటున్న ఏరియాలో ఒకరికి కరోనా సోకడంతో చుట్టుపక్కల వాళ్లకు టెస్టులు చేశారు. అందులో మహేశ్కు పాజిటివ్‌‌ వచ్చింది. చూడటానికి ఆరోగ్యంగానే ఉన్నాడు. కరోనా లక్షణాలు లేవు. బయటపడుతున్న కేసుల్లో ఇలాంటివే ఎక్కువగా ఉండటం ఆందోళనకరంగా మారింది.

దేశవ్యాప్తంగా లక్షణాల్లేకుండానే కరోనా పాజిటివ్‌ ‌వస్తున్న పేషెంట్లు ఎక్కువైతున్నారు. దేశంలో కరోనా బారిన పడిన 80 శాతం మందికి లక్షణాలు కనిపించడం లేదని భారత వైద్య పరిశోధనామండలి (ఐసీఎంఆర్) సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ గంగాఖేడ్కర్ ఇటీవల అన్నారు. నిన్నటికి నిన్న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కూడా తమ రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో 70 శాతానికి పైగా లక్షణాల్లేనోళ్లే ఉన్నారని ప్రకటించారు. సోమవారం కూడా ముంబైలో ఫీల్డ్‌‌లో ఉండి పని చేసే 53 మంది జర్నలిస్టులకు కరోనా సోకిందని, వాళకూ లక్షణాల్లేవని వెల్లడైంది. పంజాబ్‌లో 75 శాతం, కర్నాటకలో 60 శాతం కేసులు అసింప్టమాటికేనని మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. ఢిల్లీలో ఇటీవల 736 మందికి పరీక్షలు జరిపితే పాజిటివ్‌ ‌వచ్చిన 186 మందికీ లక్షణాల్లేవు. దేశంలోని 10 ప్రధాన రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితని, మూడింట రెండొంతుల మంది పేషెంట్లలో లక్షణాలు కనిపిస్తలేవని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి జనం జాగ్రత్తగా ఉండాలని, సోషల్‌‌డిస్టెన్స్‌‌ పాటించాలని సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలని, అవసరమైతే తప్ప బయటకు పోవొద్దని చెబుతున్నారు.

ప్రీ సింప్టమాటిక్‌ ఏంటీ?
ప్రీ సింప్టమాటిక్‌‌స్టేజ్‌‌ అంటే వైరస్‌ ‌వ్యాపించినా టెస్టు చేస్తే పాజిటివ్‌ ‌రాదు. మెల్లగా లక్షణాలు డెవలప్‌ అవుతాయి. దీనికి 5 నుంచి 6 రోజుల టైమ్‌ ‌పడుతుంది. కొందరికి 14 రోజులకుపైగా టైమ్‌‌పట్టొచ్చు. ప్రీ సింప్టమాటిక్‌‌స్టేజ్‌‌ లో ఉన్న వాళ్లు లక్షణాల్లేని టైమ్‌‌లో బయట తిరిగితే వేరే వాళ్లకు వ్యాధి వ్యాపించే చాన్స్‌ ‌ఉంది. ఈ స్టేజ్‌‌ లో సార్స్‌ ‌కన్నా కరోనా వ్యాప్తి చాలా వేగంగా ఉందని రీసెర్చర్లు చెబుతున్నారు. కొన్ని రీసెర్చ్‌‌లు మాత్రం వైరస్‌‌లక్షణాలు బయట పడటానికి 48 గంటల ముందు ఎక్కువగా అంటిస్తారని వివరిస్తున్నాయి. రోగనిరోధక శక్తి తక్కువున్న వాళ్లలోనే వైరస్‌‌ లక్షణాలు కనిపిస్తాయని ఐసీఎంఆర్‌‌ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్‌ ‌నిర్మల్‌ ‌కుమార్‌ ‌గంగూలీ చెప్పారు. వీళ్లలో 5 నుంచి 14 రోజుల్లో లక్షణాలు తెలుస్తాయని, సీరియస్‌ ‌అయితే మరణం కూడా సంభవిస్తుందని వివరించారు.

తక్కువ లక్షణాలున్న వాళ్లతో వ్యాపిస్తదా?
కరోనా సోకినా తక్కువ లక్షణాలున్నవాళ్లనుంచి వ్యాధి వ్యాపించే అవకాశం తక్కువని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే లక్షణాలు డెవలప్‌ అయ్యే స్టేజ్‌‌ లోనే వేరోళ్లకు అంటించే అవకాశం ఉందని మాత్రం చెప్పారు. దీన్ని పూర్తిగా సైలెంట్‌ ట్రాన్స్‌‌మిషన్‌‌ అనలేమంటున్నారు. కొంచెమైనా
సిగ్నల్స్‌‌ కనబడతాయని వాళ్లు చెబుతున్నారు. ఇలాంటి వాళ్లు పబ్లిక్‌‌ ప్లేసులు, ఇతర గ్యాదరింగ్‌‌లకు వెళ్తే వేరే వాళ్లకు వైరస్‌ ‌రావొచ్చని వివరించారు.

అసింప్టమాటిక్‌ అంటే..
అసింప్టమాటిక్‌‌అంటే మనిషికి వైరస్‌‌ అంటుకున్నా లక్షణాలేవీ కనబడవు. టెస్టు చేస్తే పాజిటివ్‌ ‌వస్తుంది. ఇలాంటి వ్యక్తులు వైరస్‌‌ను వేరే వాళ్లకు ఎక్కువగా అంటిస్తారు. పిల్లల్లో, యువకుల్లో ఈ అసింప్టమాటిక్‌ ‌ఇన్ఫెక్షన్‌ ‌ఎక్కువని సైంటిస్టులు చెబుతున్నారు. లక్షణాలు బయటపడనోళ్లలో వైరల్‌ ‌లోడ్‌ ‌ఎక్కువుంటే వైరస్‌ ‌వేరే వాళ్లకు వ్యాపిస్తుందని సైంటిస్టులు అంటున్నారు. వైరల్‌ ‌లోడ్‌ ‌ఎక్కువున్నా వీళ్లలో లక్షణాలు బయటపడవని, చైనాలో ఇలాంటి కేసులు చాలా కనిపించాయని వివరించారు. ఇంకొందరేమో లక్షణాల్లేనోళ్ల నుంచి వైరస్‌‌ తక్కువగా బయటకు వస్తుందని, కాబట్టి వ్యాపించే చాన్స్‌‌ తక్కువని అంటున్నారు. అయితే వీళ్ల వల్ల వృద్ధులు, వేరే రోగాలున్న వాళ్లకు డేంజరని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా ఇట్లనే..
కరోనా కేసులు తగ్గిపోతున్నయని, మెల్లెగా అంతా సర్దుకుంటోందని చెప్పిన చైనా.. మొన్నటికి మొన్న లక్షణాల్లేని కేసులు బయట పడుతున్నాయని వెల్లడించింది. ప్రస్తుతం ఇలాంటి పేషెంట్లు 1,500 మందికి పైగానే ఉన్నారంది. వైరస్‌ విస్తృతి ఎక్కువున్న అమెరికాలోని న్యూయార్క్‌‌లో హాస్పిటళ్లకు వస్తున్న గర్భిణులకు ఎప్పటికప్పుడు కరోనా టెస్టులు చేస్తునే ఉన్నారు. వచ్చిన వాళ్లలో 14 శాతం మందికి వైరస్‌ ఉందని, వీళ్లెవరికీ లక్షణాల్లేవని వెల్లడైంది. ఆ మధ్య బ్రిటిష్‌డైమండ్‌ ప్రిన్సెస్‌ క్రూయిజ్‌‌ షిప్‌లోని ప్యాసింజర్లకు కూడా టెస్టులు చేస్తే వైరస్‌ వచ్చిన వాళ్లలో సగం మందికి లక్షణాల్లేవని తేలింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన వాళ్లలో 25 శాతం మందికి లక్షణాలు కనిపించవని అమెరికాకు చెందిన సెంటర్స్‌‌ ఫర్‌‌ డిసీజ్‌‌ కంట్రోల్‌ అండ్ ప్రివెన్షన్‌‌ డైరెక్టర్‌‌ ఇటీవల చెప్పారు.

సైలెంట్‌ స్ప్రెడర్స్‌‌ 3 రకాలు

వైరస్‌ సోకినోళ్లలో అసింప్టమాటిక్‌, ప్రీ సింప్టమాటిక్‌, మైల్డ్‌‌ సింప్టమాటిక్‌ స్టేజ్‌‌లలో ఉన్న వ్యక్తులు సైలెంట్‌ స్ప్రెడర్స్‌‌ అని రీసెర్చర్లు అన్నారు. ప్రీ సింప్టమాటిక్‌ వ్యక్తుల నుంచి ఇతరులకు వైరస్‌ వ్యాపించే స్పీడ్‌ ఎక్కువని, అసింప్టమాటిక్‌ స్టేజ్‌‌లో ఉన్న వాళ్ల నుంచి వృద్ధులు, రోగాలున్నోళ్లకు డేంజరని చెప్పారు. తక్కువ లక్షణాలున్నోళ్లతో చాలా తక్కువ మందికి వ్యాధి అంటుతుందని అన్నారు.

For More News..

12 జిల్లాల్లో పూల్‌ టెస్టులు

దేశంలో నిన్న ఒక్కరోజే 33 మంది మృతి

లాక్డౌన్ పెంచడానికి కారణం అదే..

Latest Updates