ఆరున్నరేళ్ల కనిష్టానికి జీడీపీ

అనుకున్నదంతా అయ్యింది. అంచనాలకు తగినట్లు గానే స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఆరున్నరేళ్ల కనిష్టానికి పడిపోయింది. ఏప్రిల్‌ –జూన్‌ 2019 క్వార్టర్లో ఇండియా ఎకానమీ కేవలం 5 శాతం పెరిగింది.అంతకు ముందు ఏడాదిలోని మొదటి క్వార్టర్లో ఇండియా ఎకానమీ 5.8 శాతం వృద్ధి చెందిం ది. ఈ ఆర్థిక సంవత్సరపు మొదటి క్వార్టర్లో ఆర్థిక వృద్ధి 5.7 శాతంగా ఉంటుం దని మార్కె ట్‌ అంచనా వేసింది. కానీ, వాస్తవ వృద్ధి దీనికంటే తక్కువగానే నమోదైంది. 2013 ఆర్థిక సంవత్సరపు మొదటి క్వార్టర్‌ తర్వా త జీడీపీ వృద్ధి ఇంత తక్కువగా ఉండటం ఇదే మొదటిసారి .

ఏ రంగం ఎలా ఉందంటే…

మాన్యుఫాక్చరింగ్‌ : మాన్యుఫాక్చరింగ్‌ రంగం 2019–20 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో 0.6 శాతం మాత్రమే పెరిగింది. అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్లో ఈ వృద్ధి 12.1 శాతం.

వ్యవసాయం :వ్యవసాయం, అనుబంధ రంగాలు కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో 2శాతం పెరిగాయి. 2018–19 ఆర్థిక సంవత్సరం
మొదటి క్వార్టర్లో ఈ రంగాల వృద్ధి 5.1 శాతం.

గనులు : గనులు, క్వారీయింగ్‌ రంగాలు మాత్రం అంతకు ముందు ఏడాది మొదటి క్వార్టర్లో కంటేమెరుగైన వృద్ధి సాధిం చాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో ఈ రంగాలు 2.7 శాతంవృద్ధి చెందగా, అంతకు ముందు ఏడాది మొదటి క్వార్టర్లో ఈ వృద్ధి 0.4 శాతమే.

విద్యుత్‌ , గ్యాస్ : విద్యుత్‌ , గ్యాస్‌‌, వాటర్‌ సప్లై రంగాలుకూడా అంతకు ముందు ఏడాది మొదటి క్వార్టర్లోని 6.7 శాతం పెరుగుదల కంటే ఈ ఏడాది తొలి క్వార్టర్లో ఎక్కువగానే, 8.6 శాతం వృద్ధి సాధించాయి.

నిర్మాణ రంగం : రియల్టీ వృద్ధి ఘోరంగా పడిపోయింది. అంతకు ముందు ఏడాదిలోని మొదటి క్వార్టర్లో 9.6 శాతంగా ఉన్న వృద్ధి ఈ ఏడాది తొలి క్వార్టర్‌నాటికి 5.7 శాతానికి తగ్గిపోయింది.ట్రేడ్‌ , హోటల్స్‌ ,ట్రాన్స్‌ పోర్ట్‌‌, కమ్యూనికేషన్ , ఫైనాన్షియల్‌ , రియల్‌ ఎస్టేట్‌ , ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌‌ రంగాలూ అంతకుముందు ఏడాది మొదటి క్వార్టర్‌ తో పోలిస్తే ఈసారి తక్కువ వృద్ధినే నమోదు చేశాయి.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Latest Updates