ఆఫ్ఘనిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి.. 31 మంది పోలీసులు మృతి

ఘజ్ని : ఆఫ్ఘనిస్తాన్‌లో ఆదివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు చేసిన వేర్వేరు ఆత్మాహుతి దాడుల్లో మొత్తం 34 మంది మ‌ర‌ణించారు. వీరిలో 31 మంది భ‌ద్ర‌తా సిబ్బంది కాగా.. మ‌రో ముగ్గురు సాధార‌ణ పౌరులు. 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. తూర్పు ప్రావిన్స్‌లో ఘజ్ని రాజధాని ఘజ్ని శివార్లలో ఈ దాడి జరిగింది. గాయపడ్డ వారిని ఘజ్ని ఆసుపత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు. ఘజ్ని ప్రావిన్షియల్ కౌన్సిల్ సభ్యుడు నాసిర్ అహ్మద్ ఫక్రీ మరణాల సంఖ్యను ధ్రువీకరించారు. పేలుడు పదార్థాలతో నిండిన కారుతో దాడికి పాల్పడినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి తారిక్ అరియన్ పేర్కొన్నారు. ఈ ఘటనతో ఆఫ్ఘనిస్తాన్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. ఈ దాడికి పాల్పడింది తాలిబన్లు కావచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ఇంతవరకు ప్రకటన చేయలేదు.

Latest Updates