ఒకే సమయంలో : భూమిపై పగలు ..రాత్రి

భూమి, ఆకాశం కలుస్తాయా? కుడి ఎడమవుతుందా ? ఈ రెండూ జరగవు కదా? మరి పగలు, రాత్రి ఒకేసారి వస్తాయా? వస్తాయి!! ఏంటి డౌటా? అయితే పైనున్న చిత్రాన్ని చూడండి. భూమిపై పగలు,రాత్రి ఒకే టైంలో ఆవిష్కృతమైన అద్భుత దృశ్యమిది. నేషనల్ ఓషనిక్, అట్మాస్ ఫియర్ అసోసియేషన్ (ఎన్ఓఏఏ) నిపుణులు స్పేస్ నుంచి‘జీఓఈఎస్ (జియోస్టేషనరీ ఆపరేషనల్ ఎన్విరాన్​మెం టల్ శాటిలైట్ )  ద్వారా మార్చి 20న ఈ ఫొటో తీశారు.

ఏడాదిలో రెండు సార్లు…

ఏటా మార్చిలో ఒక రోజు, సెప్టెంబర్ లో మరో రోజు పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. మార్చిలో ఏటా మార్చి 20–21వ తేదీల మధ్య స్ప్రింగ్ ఈక్వినాక్స్ ఏర్పడుతుంది. ఆ సమయంలో సూర్యుడు సరిగ్గా భూమధ్య రేఖ మీదుగా ఉత్తరం వైపు కదులుతాడు. దక్షిణార్ధ గోళంలో ఆటమ్నల్ ఈక్వినాక్స్ సెప్టెంబర్ 22– 23వ తేదీల మధ్య ఏర్పడుతుంది. సూర్యుడు ఇలా భూమధ్య రేఖ మీదుగా వెళ్తున్న సమయంలో పగలు, రాత్రి సమానంగా ఉంటాయి.

Latest Updates