పరుగెత్తడమే తెలిసిన నిత్యకు సాయం కావాలి

Athlete Nitya Needs Financial Help for Training

Athlete Nitya Needs Financial Help for Trainingఆమెకు చిన్నతనం నుంచి పరుగెత్తడమే తెలుసు. తిండికోసం అయినా.. చదువు కోసం అయినా పరుగెత్తాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో నుంచి.. జాతీయ క్రీడాకారిణిగా ఎదిగింది అథ్లెట్ నిత్య. ప్రస్తుతం నిత్యకి పరుగే జీవితమైంది. తన సోదరుడి సలహాతో ప్రొఫెషనల్ అథ్లెట్ గా మారింది. నాలుగేళ్లలోనే జూనియర్ విభాగంలో ఇండియా నంబర్ వన్ అథ్లెట్ గా అవతరించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి మెడల్స్ సాధించి తనకు తానే సాటని నిరూపించుకుంటుంది.

ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకునే స్థోమతలేని నిత్య.. తమ బంధువు అథ్లెట్ అయిన సంజీవ్ దగ్గర కోచింగ్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. నిత్య టాలెంట్ ను గుర్తించిన సంజీవ్.. తనసొంత ఖర్చుతో ఆమెకు డైట్ తో పాటు స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. దీంతో తక్కువ కాలంలోనే జాతీయ స్థాయిలో ఎన్నో మెడల్స్ సాధించింది నిత్య. గచ్చిబౌలి స్టేడియంలో ఉన్న అరకొర వసతుల్లోనే రోజూ ప్రాక్టీస్ చేస్తోంది.

2015లో గచ్చౌబౌలి స్టేడియంలో ప్రొఫెషనల్ ట్రైనింగ్ స్టార్ట్ చేసిన నిత్య… నాలుగేళ్లలో పదుల సంఖ్యలో జాతీయ మెడల్స్ సాధించింది. జూనియర్ విభాగంలో ఇండియా నెంబర్ వన్ ర్యాంక్ సాధించింది. 2016లో జరిగిన యూత్ నేషనల్స్ లో తొలిసారిగా సిల్వర్ మెడల్ కైవసం చేసుకుంది. ఇక జూనియర్ నేషనల్స్ లో 12.1 సెకన్లలో వంది మీటర్లని పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించింది.

జూనియర్ ఫెడరేషన్ లో 12.05 సెకన్లలోనే 100 మీటర్లని కంప్లీట్ చేసి గోల్డ్ మెడల్ సాధించింది నిత్య. 2017 గుంటూర్ లో జరిగిన జూనియర్ నేషనల్స్ లో సిల్వర్ మెడల్, అదే ఏడాది ఆల్ ఇండియా యూనివర్సిటీ లో సిల్వర్ మెడల్ సాధించింది. కామన్వెల్త్ ట్రయల్స్ కోసం పట్యాలలో నిర్వహించిన సీనియర్ ఫెడరేషన్ కప్ లో ఫోర్త్ ప్లేస్ లో నిలిచింది. గతేడాది కొలొంబోలో జరిగిన శాప్ గేమ్స్ లో.. 4×100 రిలేలో సిల్వర్ మెడల్ సాధించింది నిత్య.

ఏప్రిల్ లో దుబాయ్ లోని ఖతర్ వేదికగా జరగబోయే… ఏసియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్, ఆగస్టులో జరిగే వరల్డ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడలే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తోంది నిత్య. ఇందులో మంచి ప్రతిభ కనబరిస్తే.. టీ20 ఒలంపిక్స్ కు అర్హత సాధించొచ్చని భావిస్తోంది. అయితే సరైన వసతులు లేని గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నామని.. ఇందులో ఉన్న జిమ్ ఎక్విప్ మెంట్స్ తో వర్కవుట్ చేస్తే లేనిపోని ఇంజ్యూరీస్ అవుతున్నాయంటోంది. ఎవరైనా చేయూతనందించాలని కోరుతోంది నిత్య.

Latest Updates