పావు కిలోమీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎత్తులో తాడుపై నడిచి..

తాడుపై నడవడమంటేనే పెద్ద సాహసం. అలాంటిది పావు కిలోమీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మించి ఎత్తున్న రెండు బిల్డింగులకు తాడు కట్టి నడవడం, రకరకాల ఫీట్లు చేయడమంటే..? అస్సలు మామూలు విషయం కాదు. ఇలాంటి స్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇప్పటివరకు చాలా మంది చాలా రికార్డులు నెలకొల్పారు. తాజాగా ఓ ఏడుగురు అథ్లెట్లు సిటీ స్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంతకుముందు రికార్డును బద్దలు కొట్టి కొత్త చరిత్ర సృష్టించారు. రష్యా, జర్మనీ, ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కెనడాలకు చెందిన అథ్లెట్లు.. 347 మీటర్ల ఎత్తులో 243 మీటర్ల పొడవైన తాడుపై నడిచి గతంలోని 330 మీటర్ల రికార్డును బద్దలు కొట్టారు.

గత శని, ఆదివారాల్లో యూరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అతి పొడవైన బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెవా టవర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ప్రస్తుతం కడుతున్నారు), రెండో అతి పొడవైన బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓకో టవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఈ సాహసం చేశారు. ఈ సాహసానికి సంబంధించి వివరాలు, కొలతలు తీసుకున్న గిన్నిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డు స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ త్వరలోనే దీని వివరాలు వెల్లడించనున్నారు. సిటీ స్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంతకుముందున్న రికార్డు అలెగ్జాండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్చుల్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది. ఈయన 2016లో మెక్సిలో సిటీలో 246 మీటర్ల ఎత్తులో 213 మీటర్లు నడిచారు.

Latest Updates