భార్య భర్తల మధ్య గొడవ.. భర్త ప్రాణాలు కాపాడిన సీఐ

భార్య తాను చెప్పిన మాట వినడం లేదని ఓ భ‌ర్త జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టాడు. నీళ్ల‌లో దూకేందుకు ప్ర‌య‌త్నిస్తున్న అతన్ని అదే స‌మ‌యానికి అటుగా వెళుతున్న ఆత్మ‌కూర్ సీఐ సీత‌య్య ఆ వ్య‌క్తిని కాపాడి అత‌నికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. వ‌న‌ప‌ర్తి జిల్లా ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

రెవల్లి మండలానికి చెందిన భాస్కర్ కు ఆత్మకూర్ మండలం బలకిష్టపూర్ గ్రామంలోని తన భార్య లాక్‌డౌన్ కారణంగా అక్కడే ఉండి పోయింది. భార్యతో గొడవపడిన భాస్కర్ శుక్రవారం మధ్యాహ్నం మాదనపూర్ మండలం గోపన్ పేట, కొత్తపల్లి గ్రామాల్లోని బ్రిడ్జిపై నుంచి నీళ్లలో దూకె యత్నం చేశాడు. ఈ క్రమంలో ఆత్మకూర్ నుంచి మాదనపూర్ కు వెళుతున్న సిఐ సీతయ్య గమనించి రెప్పపాటులో వాహనం నుంచి దిగి భాస్కర్‌ను కాపాడారు. అత‌న్ని మాదనపూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి, పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఎసై సైదులును ఆదేశించారు సీఐ సీతయ్య.

Latest Updates