గంభీర్.. ఇంతకు దిగజారుతావా?: ఆప్ అభ్యర్థి అతిషి

న్యూఢిల్లీ: ‘‘రాజకీయాల్లోకి గంభీర్ వచ్చినప్పుడు స్వాగతించాను. కానీ ఎన్నికల్లో గెలిచేందుకు ఆయన ఇంతలా దిగజారుతారని అనుకోలేదు” అని ఈస్ట్ ఢిల్లీ సెగ్మెంట్ ఆప్ అభ్యర్థి అతిషి కన్నీరుపెట్టుకున్నారు. తనకు వ్యతిరేకంగా అసభ్య, అవమానకరమైన వ్యాఖ్యలతో కూడిన పాంప్లెట్లను మాజీ క్రికెటర్, బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ పంచుతున్నారని ఆరోపించారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పాంప్లెట్లను చదువుతూ ఒక్కసారిగా ఏడ్చేశారు. ‘‘నా గురించి, నా ఫ్యామిలీ గురించి అసభ్య వ్యాఖ్యలతో ముద్రించిన పాంప్లెట్లను హౌసింగ్ కాంప్లెక్సుల్లో బీజేపీ పంచుతోంది. నేను గంభీర్​ను ఒకటే అడుగుతున్నా. ఆయన ఒక మహిళకు వ్యతిరేకంగా ఇలా చేస్తుంటే.. ఇక ఈస్ట్ ఢిల్లీలోని లక్షలాది మంది మహిళల పరిస్థితేంటి?” అని ప్రశ్నించారు.

నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా: గంభీర్

తనపై అతిషి చేస్తున్న ఆరోపణలను గంభీర్ ఖండించారు. ‘‘కేజ్రీవాల్, అతిషిని చాలెంజ్ చేస్తున్నా. ఆ ఆరోపణలు నిజమని నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా. కాదని తేలితే, మీరు పాలిటిక్స్ నుంచి తప్పుకుంటారా?” అని ట్వీట్ చేశారు. ‘‘ఎన్నికల్లో గెలవడానికా ఇదంతా? మీరు మురికి పట్టారు మిస్టర్ సీఎం. మీ డర్టీ మైండ్ ను క్లీన్ చేయాలంటే మీ ‘చీపురు’నే ఉపయోగించాలి’’ అని మరో ట్వీట్ చేశారు.

 

Latest Updates