అట్లాస్ సైకిల్స్ వైస్ ప్రెసిడెంట్ భార్య సూసైడ్

ప్రముఖ సైకిల్ కంపెనీ.. అట్లాస్ సైకిల్స్ జాయింట్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ కపూర్ భార్య నటాషా కపూర్ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. లుటియెన్స్ ఢిల్లీలోని ఔరంగజేబ్ లేన్‌లో ఉన్న తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆమె చనిపోయిందని పోలీసులు తెలిపారు. 57 ఏళ్ల నటాషా కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతూ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో నటాషా ఆత్మహత్య గురించి తమకు సమాచారం అందిందని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

నటాషా ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆమె కుమార్తె మరియు కొడుకు ఇంట్లోనే ఉన్నారు. ఆ సమయంలో ఆమె భర్త సంజయ్ కపూర్ ఇంట్లో లేరని ఆమె పిల్లలు తెలిపారు. ‘నటాషాను భోజనానికి రమ్మని ఆమె కుమారుడు సిద్ధాంత్ మంగళవారం మధ్యాహ్నం రెండుసార్లు ఫోన్ చేశాడు. కానీ ఆమె ఫోన్ ఎత్తలేదు. దాంతో సిద్ధాంత్ ఆమె గది దగ్గరికి వెళ్లాడు. గది తలుపులు తెరచి చూడగా నటాషా సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే సిద్ధాంత్ పనిమనుషుల సాయంతో ఆమెను కిందికి దించాడు. నటాషాను వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్లు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నాం’ అని డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఈష్ సింఘాల్ తెలిపారు. నటాషా గదిలోని సాక్ష్యాలను సేకరించడంతో పాటు.. సూసైడ్ నోట్ యొక్క చేతివ్రాత ధృవీకరించడానికి ఫోరెన్సిక్ బృందం కపూర్ ఇంటిని పరిశీలించినట్లు ఆయన తెలిపారు. బుధవారం పోస్ట్‌మార్టం అనంతరం నటాషా మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. నటాషా అంత్యక్రియలు లోధి రోడ్ శ్మశానవాటికలో జరిగాయి.

For More News..

క్షణాల్లో వాటర్‌ట్యాంక్ ఎలా కూలిందో చూడండి..

వరల్డ్ రికార్డ్: 75 ఏళ్ల వయసులో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా..

‘మంజు చాలామందితో…. అందుకే చంపేశా’

Latest Updates