ATM లో ఫేక్ నోట్లు : RBIకి బదులుగా చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

cbinoteATM లలో దొంగనోట్లు వచ్చిన ఘటన అప్పట్లో దుమారంరేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా నోట్లపై పేర్లనే మారుస్తున్న ఫేక్ నోట్లు దర్శణమిస్తున్నాయి. RBI పేరుతో వచ్చిన నోట్లు చలామణిలో ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే ఇందుకుభిన్నంగా కాన్పూర్‌లోని ఓ ATMలో చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఉన్న నోట్లు బయటకు వచ్చాయి. మార్బుల్ మార్కెట్‌లో ఉన్న యాక్సిస్ బ్యాంకు ATMలో డబ్బులు డ్రా చేయగా..చిల్డ్రన్ బ్యాంకు ఆఫ్ ఇండియా పేరుతో ఉన్న నకిలీ 500 రూపాయల నోట్లు వచ్చాయి. సచిన్ అనే వ్యక్తి రూ.10 వేలు డ్రా చేయగా చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించబడి ఉన్న రూ.500 నోటు వచ్చింది. ఈ విషయాన్ని ATM సెక్యూరిటీ గార్డుకు ఫిర్యాదు చేశాడు. నకిలీ నోట్లు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరానని చెప్పాడు. తమకు వచ్చిన నకిలీ నోటు సోమవారం (ఫిబ్రవరి-12)న మార్పిడి చేస్తామని అధికారులు చెప్పారని వెల్లడించాడు సచిన్.

Posted in Uncategorized

Latest Updates