ATM సెంటర్లలో రద్దీ : ఆందోళన, నిరసనల్లో బ్యాంక్ ఉద్యోగులు

bank-atmsఇవాళ, రేపు ప్రభుత్వ రంగ బ్యాంకులు బంద్ పాటిస్తున్నాయి. వేతన సవరణ డిమాండ్ తో.. దేశమంతటా బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఈ ఉదయం 6 గంటల నుంచి.. 48 గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు…కొన్ని ప్రైవేటు బ్యాంకులు తెరుచుకోలేదు. ఆన్ లైన్ లావాదేవీలు యధావిధిగా జరుపుకోవచ్చని అధికారులు చెప్పారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం అవ్వటంతో.. విధిలేని పరిస్థితుల్లో సమ్మెకి దిగినట్లు తెలిపారు బ్యాంకు ఉద్యోగులు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 80వేల మంది అధికారులు, ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. దేశం మొత్తం 10 లక్షల మంది సమ్మెలో ఉన్నారు.

14 నుంచి 15 శాతం వేతనాల పెంపును డిమాండ్ చేస్తోంది బ్యాంక్స్ ఎంప్లాయిస్ యూనియన్.  నష్టాల్లో ఉన్నందున.. ఆ స్థాయిలో పెంపు సాధ్యం కాదని ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ స్పష్టం చేసింది. కేవలం రెండు శాతం మాత్రమే పెంచేందుకు అంగీకరించింది. చాలాసార్లు చర్చలు జరిగినా.. అసోసియేషన్ దిగిరాలేదు. దీంతో  21 ప్రభుత్వ రంగ బ్యాంకులు, కొన్ని ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంక్ ఉద్యోగులు ఈ సమ్మెకి దిగారు. రెండురోజులు బ్యాంకుల సమ్మె కారణంగా ATM సెంటర్ల దగ్గర క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రోజువారీ లావాదేవీలు చేసే.. వ్యాపారులు ఏటీఎం సెంటర్లకు వస్తున్నారు. బ్యాంక్ ఉద్యోగులకు మద్దతుగా.. ATM సర్వీస్ ప్రొవైడర్లు, సెక్యూరిటీ సిబ్బంది కూడా విధులకు దూరంగా ఉన్నారు.

 

Posted in Uncategorized

Latest Updates