ఏటీఎం చోరీకి వచ్చి..బైక్ దొంగతనం

హైదరాబాద్‌,-వెలుగు: ఏటీఎంలో చోరీకి యత్నించి విఫలమై..పార్కింగ్ లో ఉన్న బైక్ ను దొంగిలించిన ఇద్దరు యువకులను మీర్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ ఆనంద్ కిశోర్ కథనం ప్రకారం..పాతబస్తీలోని మొగల్‌పుర సుల్తాన్‌షాహిబస్తీకి చెందిన మహ్మద్‌ అసద్‌(-20), జహానుమాలోని వట్టేపల్లి బస్తీకి చెందిన అబ్దుల్ అసద్(-23) ఇద్దరూ ఈ నెల15న రాత్రి పత్తర్ గట్టి ఎస్ వైజే కాంప్లెక్స్ లో ఉన్న కెనరా బ్యాంక్ ఏటీఎంలో డబ్బు చోరీకి యత్నించి విఫలమయ్యారు.

అక్కడినుంచి వెళ్తూ.. పార్కింగ్‌లో బైక్ ను దొంగిలించారు.ఆ బైక్ ఓనర్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. ఏటీఏంలోనూ చోరీకి యత్నం జరిగినట్టు గుర్తించిన కెనరా బ్యాంక్ మేనేజర్ బిలాల్ మీర్ చౌక్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా శనివారం మహ్మద్ అసద్, అబ్దుల్ అసద్ ను అదుపులోకి తీసుకున్నారు.

Latest Updates