ఆటూ మొబైల్‌ నుంచి ఆటమ్‌1.0..ఒక్క సారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ

  • పూర్తి ఛార్జ్ కు ఒక్క యూనిట్‌ కరెంటు చాలు
  • వంద కిలోమీటర్ల ప్రయాణం ఖర్చు కేవలం రూ.10

హైదరాబాద్‌‌, వెలుగుసిటీకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్స్ స్టార్టప్‌‌ ఆటూమొబైల్‌‌  ‘ఆటమ్‌‌ 1.0’ పేరుతో ఎలక్ట్రిక్ టూవీలర్‌‌ను లాంచ్‌‌ చేసింది. తక్కువ కరెంటు ఖర్చు, ఎక్కువ మైలేజ్‌‌, భారీ బ్యాటరీ, ఆకర్షణీయమైన రూపం, బలమైన టైర్లు, సౌకర్యవంతమైన సీటు దీని ప్రత్యేకతలు. ఇందులోని లిథియం అయాన్‌‌ బ్యాటరీని నాలుగు గంటలు చార్జ్‌‌ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. బ్యాటరీపై రెండేళ్ల వారంటీ ఉంటుంది.  టీనేజర్లు సహా పెద్దవాళ్లు, సీనియర్‌‌ సిటిజెన్స్‌‌కూ అనువుగా ఉంటుంది. త్రీపిన్‌‌ సాకెట్‌‌ ద్వారా చార్జ్‌‌ చేసువకోవచ్చు. ఒక్కసారి పూర్తి చార్జ్‌‌ చేస్తే కేవలం యూనిట్‌‌ కరెంటు ఖర్చవుతుంది. అంటే, వంద కిలోమీటర్ల ప్రయాణం ఖర్చు పది రూపాయలు మించదు. సాధారణ బైక్స్‌‌కు అయితే ఇది రూ.100 దాటుతుంది. మనదేశంలో దొరికే కాంపోనెంట్స్‌‌తోనే ఆటమ్‌‌ను తయారు చేశారు.

హైదరాబాద్ లోని మా మాన్యుఫ్యాక్చరింగ్‌ ఫెసిలిటీలోనే దీనిని తయారు చేశాం. మా కంపెనీ మొదటి నుంచి పర్యావరణానికి అనుకూలమైన ప్రొడక్టులను తయారుచేస్తోంది. ఆటమ్‌ టూవీలర్‌ తయారీకి మూడేళ్లు కష్టపడ్డాం. మా ప్లాంటుకు ఏటా 10 వేల ఈ-బైక్స్ ను తయారు చేసే కెపాసిటీ ఉంది. మా బైక్‌కు ఇంటర్నేషనల్ సెంటర్‌ ఫర్‌ ఆటోమోటివ్‌ టెక్నాలజీ (ఐక్యా ట్‌) నుంచి కూడా అప్రూవల్‌ వచ్చింది కాబట్టి కమర్షియల్‌గానూ ఉపయోగించుకోవచ్చు. ఆటమ్‌ 1.0కు రిజిస్ట్రేషన్‌, డ్రైవింగ్‌ లైసెన్సు అవసరం లేదు. టీనేజర్లు కూడా నడుపుకోవచ్చు.ఈ టూవీలర్‌ మన ఇండియన్‌ రోడ్లకు అనుకూలంగా ఉంటుంది’’ – గడ్డం వంశీ,ఆటూమొబైల్‌ ఫౌండర్‌

Latest Updates