ATP ర్యాంకింగ్స్‌: వరల్డ్ నెం.1 గా ఫెదరర్

roger federarస్విస్ టెన్నిస్‌ స్టార్,రోజర్ ఫెదరర్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్(ATP)  వరల్డ్ ర్యాంకింగ్స్‌లో మళ్ళీ నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. ఆదివారం(ఫిబ్రవరి-18) రోటెర్‌డ్యామ్ ఓపెన్‌లో క్వార్టర్స్‌లో గెలిచిన ఫెదరర్ కెరీర్‌లో 97వ టైటిల్ కైవసం చేసుకున్నాడు. దీనితో 36 ఏళ్ళ వయసులో నెంబర్ స్థానం దక్కించుకున్న టెన్నిస్ ప్లేయర్‌గా రికార్డు సాధించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత నిర్వాహకులు ప్రత్యేకంగా నెంబర్ వన్ షీల్డ్‌ను అందించారు.

ఆదివారం ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఫెదరర్ 6-2,6-2తో గ్రిగర్ దిమిత్రోవ్(బల్గేరేయా)ను వరుస సెట్లలో ఓడించాడు. ఈ టోర్నీలో గెలవడం అతనికి మూడోవది. ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో టైటిల్ సాధించించాడు.

సోమవారం అధికారికంగా ప్రకటించిన ATP ర్యాంకింగ్స్‌లో ఫెదరర్ వరల్డ్ నెం.1 స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. చివరిసారిగా 2012 అక్టోబర్‌లో నంబర్ వన్ ర్యాంకును దక్కించుకున్నాడు. చాలా కాలం తర్వాత ఫెదరర్ మళ్లీ నంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. 22ఏళ్ల వయసులోనే తొలిసారి 2004లో నెం.1 స్థానాన్ని అధిరోహించాడు. 36ఏళ్ల వయసులోనూ తన జోరు కొనసాగిస్తూ యువ క్రీడాకారులకు సవాల్ విసురుతున్నాడు.

ఈ సీజన్‌లో మరింత జోరు పెంచి 100 టైటిళ్ల మార్క్‌ను అందుకోవాలని స్విస్ మాస్టర్ భావిస్తున్నాడు.

Posted in Uncategorized

Latest Updates