
మేడ్చల్ జిల్లా శామీర్ పేట పీఎస్ పరిధిలోని ఉప్పర్ పల్లిలో ప్రహరీ గోడ విషయంలో తలెత్తిన వివాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సత్తిరెడ్డి అనే వ్యక్తిపై విరస్వామి రౌడీలచే దాడి చేయించాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సత్తిరెడ్డి ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్తతగా మారింది భువనగిరి కి చెందినవారు గంజాయ్ సేవించి కర్రలతో సత్తిరెడ్డిపై దాడి చేశారని సత్తిరెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన స్థలానికి వచ్చిన సీఐ సంతోషం మాట్లాడుతూ.. గత రెండు నెలలుగా సత్తిరెడ్డి కుటుంబానికి, వీరస్వామి కుటుంబానికి తరచుగా చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయని… ఆ గొడవ కాస్త ఉద్రిక్తంగా మారిందన్నారు. స్థానికులు 100కు డయల్ చేయగా వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చామన్నారు. ఈ గొడవకు కారణమైన వారిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
see more news